రాయలసీమ పౌరుషం తెలియదు: టిడిపి నేతపై విరుచుకుపడిన శ్రీరాములు
కర్నూలు: తెలుగుదేశం పార్టీ (టిడిపి) కేంద్ర క్రమ శిక్షణా కమిటీ సభ్యుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నోరు అదుపులోకి పెట్టుకొని మాట్లాడక పోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రాయలసీమ పరిరక్షణ సమితి స్టూడెంట్ ఫెడరేషన్ (ఆర్‌పీఎస్‌ఎస్‌ఎఫ్) కర్నూలు జిల్లా అధ్యక్షుడు బి.శ్రీరాములు హెచ్చరించారు.
శుక్రవారం కల్లూరులోని తన స్వగృహంలో ఆర్‌పీఎస్ ఎస్‌ఎఫ్ నూతన సంవత్సరం ప్యాకెట్ క్యాలెండర్‌ను బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీరాములు మాట్లాడారు. కోస్తా (నెల్లూరు) నుంచి బతుకు తెరువు కోసం వలస వచ్చిన సోమిశెట్టికి రాయలసీమ పౌరుషం ఏమి తెలుస్తుందని అన్నారు.

జననేత, రాయలసీమ ప్రజల సమస్యల కోస నిత్యం పోరాడుతున్న బైరెడ్డిని విమర్శించే స్థాయి సోమిశెట్టికి లేదని అన్నారు. సోమిశెట్టికి దైర్యం ఉంటే రాయలసీమ రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడాలన్నారు. జిల్లాలో జరగబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ఆయన తెలిపారు.
2016 సంవత్సరం రాయలసీమకు ఉద్యమ సంవత్సరంగా మారనుందని ఆయన తెలిపారు. సమావేశంలో ఆర్‌పీఎస్ నాయకులు, ఆ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications