శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం
తిరుమలలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారంనాడు శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీరామనవమి ఆస్థానం
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగనుంది. ఆ తరువాత రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు.
అదేవిధంగా ఏప్రిల్ 7వ తేది శ్రీరామ పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.
శేషవాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల కటాక్షం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన ఆదివారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటల నుంచి భజన బృందాల కోలాటాల నడుమ పురవీధుల్లో వాహనసేవ జరిగింది.
ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవతరించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.
వాహన సేవలో ఆలయ డెప్యూటీ ఈఓ నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్, ఇతర అధికారులు ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారంనాడు శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర బద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. కంకణబట్టర్ శ్రీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కంకణబట్టర్ శ్రీ రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, నేత్రోల్మీలనం నిర్వహించామన్నారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసినట్టు చెప్పారు. రాగతాళ నివేదన ద్వారా ఇంద్రాది సకలదేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్టు వివరించారు.
భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న సంపూర్ణ రామాయణం సెట్టింగ్
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంపూర్ణ రామాయణం సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇందులో రామాయణంలోని వివిధ ఘట్టాలను తెలియజేసే శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను ఉయ్యాలలో పవళింపజేస్తున్న దశరధుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, విశ్వామిత్ర మహర్షి యజ్ఞ రక్షణార్థం మారీచా, సుబాహు అనే రాక్షసులను సంహరిస్తున్న శ్రీరామ లక్ష్మణులు, జనక మహారాజు సభ యందు శివధనస్సు విరుస్తున్న శ్రీరామచంద్రుడు, సీతారామ కళ్యాణ వైభోగం సెట్టింగులు ఆకట్టుకున్నాయి.
అదేవిధంగా సీతమ్మను అపహరిస్తున్న రావణాసురుడు, లంకకు వారధి కడుతున్న వానరసైన్యం, వనవాస కాలమున సూర్పనఖ అనే రాక్షసి ముక్కు చెవులను కోస్తున్న లక్ష్మణుడు, శ్రీరామ పట్టాభిషేకం తదితర కళాఖండాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అదేవిధంగా ఆలయం లోపల, బయట వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ తో భక్తులను ఆకట్టుకునేలా వినూత్నంగా అలంకరణలు చేశారు.












Click it and Unblock the Notifications