వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవి మృతిపై టీవీల్లో సర్కస్ ఫీట్లు అంటూ విమర్శలు: బాత్ టబ్‌లోకి దిగుతూ..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Sridevi's Bathtub 'Trolls' by Channels: A Reporter Even Jumped Into Bathtub | Oneindia Telugu

దుబాయ్: నటి శ్రీదేవి మృతి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత ఆమె కార్డియాక్ అరెస్టుతో మృతి చెందినట్లుగా భావించినప్పటికీ, మద్యం మత్తులో బాత్ టబ్‌లో పడి చనిపోయినట్లుగా ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది.

అదే సమయంలో శ్రీదేవి మృతిపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బాత్ టబ్‌లో పడి మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మీడియా ప్రతినిధులు కొందరు తమ తమ టీవీ చానళ్లలో ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపేందుకు చేసిన ప్రయత్నాలు విమర్శలకు తావిచ్చింది.

బాత్‌టబ్‌లలోకి దిగి రిపోర్టింగ్

బాత్‌టబ్‌లలోకి దిగి రిపోర్టింగ్

శ్రీదేవి మృతి నేపథ్యంలో కొందరు రిపోర్టర్లు బాత్ టబ్‌లలోకి దిగి సర్కస్ ఫీట్లు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. బాత్రూంలో శ్రీదేవి చివరి పదిహేను నిమిషాలు అని ఒకరు, బాత్ టబ్‌లోకి దిగి రిపోర్టింగ్ మరొకరు చేశారు.

బాత్రూంలో టబ్‌లో శ్రీదేవి పడినట్లుగా

తెలుగులో ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ అయితే శ్రీదేవి బాత్ టబ్‌లో పడి ఉన్నట్లుగా చూపించింది. ఆమె బాత్ టబ్‌లో పడి ఉన్నప్పుడు బోనీ కపూర్ చూస్తున్నట్లుగా కూడా గ్రాఫిక్ చేశారు. అంతేకాదు, అల్కాహాల్ బాటిల్స్‌తోను సీన్ రీ కన్‌స్ట్రక్ట్ చేశారు.

ఇంగ్లీష్ చానల్స్‌లోను

ఇంగ్లీష్ చానల్స్‌లోను శ్రీదేవి బాత్ టబ్‌లో పడినట్లుగా గ్రాఫ్స్, సీన్ రీ కన్‌స్ట్రక్ట్ చేసే ప్రయత్నాలు చేశాయి. శ్రీదేవి టబ్ పక్కన నిల్చొని ఉండగా.. ఆమె కొలతలు, టబ్ కొలతలు కూడా ఇచ్చారట.

శ్రీదేవికి, సునంద పుష్కర్‌కు లింక్ చేస్తూ

శ్రీదేవికి, సునంద పుష్కర్‌కు లింక్ చేస్తూ

కొన్ని టీవీ ఛానల్స్ శ్రీదేవి మృతికి, సునంద పుష్కర్ మృతికి లింక్ చేస్తూ వార్తలు ఇచ్చాయి. ఇక తెలుగులో అయితే ఓ ఛానల్ రిపోర్టర్ బాత్ టబ్‌లో కూర్చొని ఇన్వెస్టిగేషన్ తీరును వివరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాత్ టబ్‌లోకి దిగితే

బాత్ టబ్‌లోకి దిగితే

సదరు టీవీ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ గులాబీ రంగులో ఉన్న బాత్ టబ్ పక్కన నిల్చొని, శ్రీదేవి ప్రమాదవశాత్తు పడ్డారా మరో కోణం ఉందా అని ప్రశ్నిస్తూ.. అతను అందులోకి దిగారు. బాత్ టబ్‌లోకి దిగితే చనిపోయే అవకాశాలు లేవని చెప్పారని అభిప్రాయపడింది. కాబట్టి ఆమెను ఎవరైనా అందులో ముంచారా అని ప్రశ్నించారు.

English summary
The media has been competing with each other on how to grab maximum eyeballs when discussing the death of the actor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X