వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవి శ్రీవారికి పరమభక్తురాలు, సినిమా విడుదలైందంటే చాలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Sridevi's Bonding With Tirupati

ముంబై: సినీ నటి శ్రీదేవి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి భక్తురాలు. ఆయన అంటే అమితమైన భక్తి. పలుమార్లు తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఎంత లేదన్నా ఏడాదికి ఓసారి శ్రీవారిని దర్శించుకునేవారు.

చివరిగా గత ఏడాది జూన్‌ 24న శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవంటే శ్రీదేవికి చాలా ఇష్టం. 2012లో వచ్చిన ఇంగ్లిష్‌ వింగ్లిష్ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.

బోనీకపూర్‌ను ఎందుకు పెళ్లి చేసుకుందంటే: పెళ్లిలో.. శ్రీదేవి చివరి క్షణాలు (ఫోటోలు)బోనీకపూర్‌ను ఎందుకు పెళ్లి చేసుకుందంటే: పెళ్లిలో.. శ్రీదేవి చివరి క్షణాలు (ఫోటోలు)

సినిమాలకు ముందు శ్రీవారి దర్శనం

సినిమాలకు ముందు శ్రీవారి దర్శనం

ఈ చిత్రం 2012 అక్టోబరు 5న విడుదల కాగా అంతకు ముందు సెప్టెంబరు 5న శ్రీదేవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీదేవి తల్లిగా నటించిన చిత్రం మామ్ 2017 జులై 7న విడుదల కాగా అంతకు ముందు జూన్‌ 24న చివరిసారిగా శ్రీవారిని భర్త బోనీకపూర్‌తో కలిసి దర్శించుకున్నారు.

బాత్రూంలోనే శ్రీదేవి.. విషాదం ఇలా!: అతిలోక సుందరి గురించి కొన్ని విషయాలు...బాత్రూంలోనే శ్రీదేవి.. విషాదం ఇలా!: అతిలోక సుందరి గురించి కొన్ని విషయాలు...

తిరుపతితో అనుబంధం

తిరుపతితో అనుబంధం

శ్రీదేవికి చిత్తూరు జిల్లాలోని తిరుపతితో అనుబంధం ఉంది. ఆమె తల్లిదండ్రులు కొద్దికాలం తిరుపతిలో నివసించారు. శ్రీదేవి పుట్టకముందు వారు స్థానిక ఆకుతోట వీధిలో ఉండేవారు. కొన్ని కారణాల రీత్యా తర్వాత చెన్నైకు వెళ్లారు. అయినా తరచూ తిరుపతికి వచ్చి వెళ్లేవారు. శ్రీదేవి తల్లి రాజేశ్వరి సొంత చెల్లెలు అనసూయమ్మ ఇప్పటికీ తిరుపతిలోనే ఉంటున్నారు. ఈ కారణంగానే రాజేశ్వరి తరుచూ తిరుపతికి వచ్చివెళ్లేవారు.

కాళహస్తిలో శ్రీదేవి

కాళహస్తిలో శ్రీదేవి

శ్రీదేవి.. శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని సేవకు వచ్చారు. 2015 జులై 19వ తేదీన ఆమె తన స్నేహితురాలితో కలసి వాయులింగేశ్వరుని దర్శనార్థనార్థం వచ్చారు. ఆ సమయంలోనే ముక్కంటి ఆలయంలోని సహస్రలింగేశ్వరుని వద్ద రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

దర్శనం చేయించారు

దర్శనం చేయించారు

సినీ నటి శ్రీదేవి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తన కుటుంబ సభ్యులతో కలిసి 2013 డిసెంబర్ 5న దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు నాడు వచ్చిన శ్రీదేవి, ఆమె భర్త బోనీకపూర్ తదితరులకు ఆలంయ వద్ద ఘన స్వాగతం లభించింది. నాటి టిటిడి అధ్యక్షులు కనుమూరి బాపిరాజు దంపతులు శ్రీదేవి కుటుంబ సభ్యులకు దగ్గర ఉండి దర్శనం చేయించారు.

గంటన్నర సమయం

గంటన్నర సమయం

ఇదిలా ఉండగా, దుబాయ్‌లో ఉన్న శ్రీదేవి మృతదేహం రప్పించేదుకు ప్రయత్నిస్తున్నారు. ఫోరెన్సిక్‌ రిపోర్ట్ ‌అందిన వెంటనే భౌతికకాయం దెబ్బతినకుండా కొన్ని ప్రక్రియలు నిర్వహిస్తారు. దీనిని ఎంబాల్మింగ్‌ అంటారు. ముహైస్ని ఎంబాల్మింగ్‌ సెంటర్‌లో దీనిని నిర్వహిస్తారు. దీనికి గంటన్నర సమయం పడుతుంది.

ముంబైకి తరలిస్తారు

ముంబైకి తరలిస్తారు

పోలీసులు మరణ ధ్రువపత్రాన్ని జారీ చేయాల్సి ఉంది. శ్రీదేవి పాస్‌పోర్ట్‌ను భారత దౌత్యకార్యాలయం రద్దు చేస్తుంది. ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కొన్ని ప్రక్రియలు పూర్తి చేస్తారు. భౌతికకాయాన్ని అప్పగించేందుకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అనుమతి ఇస్తారు. ప్రయివేటు జెట్‌లో శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైకి తరలిస్తారు.

English summary
Delay in release of body not unusual; all procedures laid down by UAE govt being followed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X