Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Srikakulam Lok Sabha Election 2024 Results LIVE: రామ్మోహన్ నాయుడు గట్టెక్కేనా?

శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి. ధీమాగా ఉంటోన్నాయి. ఆ ధీమాతోనే ఆయా పార్టీల అధినేతలు విదేశీ పర్యటనల్లో ఉంటోన్నారు.

ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.

AP election Results Srikakulam Lok Sabha Election 2024 Results voting counting live updates news in telugu

ఓటింగ్ సందర్భంగా శ్రీకాకుళంలో 74.43 శాతం మేర పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్ల సంఖ్య 16,31,174 కాగా..ఇందులో 12,14,128 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో మహిళల శాతమే అధికంగా నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మొత్తం 76.31 శాతం మేర మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల పోలింగ్ శాతం 72.31గా నమోదైంది. 12.06 శాతం ట్రాన్స్‌జెండర్లు ఓటు వేశారు. ఈ లోక్‌సభ పరిధిలోని నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికం, శ్రీకాకుళం అసెంబ్లీలో అత్యల్పంగా పోలింగ్ శాతం రికార్డయింది.

నరసన్నపేట- 80.90, ఆమదాలవలస- 79.62, టెక్కలి- 79.08, పలాస- 75.34, పాతపట్నం- 71.06, ఇచ్ఛాపురం- 69.73, శ్రీకాకుళం- 68.31 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఇక్కడ విజయం తమదంటే తమదేనంటూ వైఎస్ఆర్సీపీ, టీడీపీ చెప్పుకొంటోన్నాయి. ఆయా పార్టీల్లో ఎవరు గెలుస్తారనేది మహిళల ఓట్లు తేల్చేయనున్నాయి.

ఇక్కడ గెలిస్తే- తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ కొట్టినట్టవుతుంది. ఇప్పటివరకు వరుసగా రెండుసార్లు ఆయన విజయం సాధించారు. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. 2014లో 1,27,572 ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించినా.. 2019లో మాత్రం అతి తక్కువ మెజారిటీ ఒడ్డునపడ్డారు.

ఆ ఎన్నికలో వైఎస్ఆర్సీపీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్‌పై 6,653 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. టెక్కలి అసెంబ్లీలో వచ్చిన మెజారిటీ ఆయన విజయానికి దోహదం చేసింది. ఈ సారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని మార్చింది. దువ్వాడ శ్రీనివాస్‌కు బదులుగా పేరాడ తిలక్‌కు టికెట్ ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+