శ్రీకాకుళం పార్లమెంట్ సమీక్షకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యే, ముఖ్య నాయకులు ... చంద్రబాబు ఆగ్రహం

ఏపీ ఎన్నికల ఫలితాలపై పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థులతో , ముఖ్య నాయకులతో చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ సరళిపై శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యే హాజరు కాకపోవటంతో చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకపక్క అధికారులు, మరో పక్క సొంతపార్టీ నేతలు సైతం సమీక్షలకు డుమ్మా కొడుతున్న తీరు చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది.

శ్రీకాకుళంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు హాజరు కావాల్సి ఉండగా ఈ సమీక్షకు శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యే గుండాలక్ష్మీదేవి హాజరుకాకపోవడంతో శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ముఖనేతలు కూడా హాజరు కాలేదు. దీంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమీక్షకు సంబంధించి షెడ్యూల్ ముందే ఇచ్చినపటికీ ఎమ్మెల్యే హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యమా అంటూ మండిపడ్డారు.

 Srikakulam MLA and main leaders did not attend the review meeting ... Chandrababu serious

అయితే ఎమ్మెల్యే గుండా లక్ష్మీ దేవి సమీక్షకు హాజరు కాకపోవటానికి బలమైన కారణమే ఉంది. గుండా లక్ష్మీ దేవి కుటుంబ సభ్యుడు చనిపోవడంతో సమీక్షకు హాజరు కాలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే హాజరుకాకపోవడంతో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబందించి కీలక నేతలు కూడా డుమ్మా కొట్టారు . దీంతో ఏం చెయ్యాలో పాలుపోని చంద్రబాబు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు .ఇది పద్థతికాదంటూ అక్కడ ఉన్న నేతలకు క్లాస్ పీకారు. టీడీపీ నేతలు క్రమశిక్షణతో మెలగాలని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలంటూ హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+