మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబ‌యిన శ్రీకాళహస్తి...

మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తి ముస్తాబ‌యింది. మార్చి 3 నుంచి అంటే నేటి నుంచి మార్చి 16వ‌ర‌కూ ఈ బ్ర‌హ్మోత్స‌వాల కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీ‌కాళ‌హ‌స్తి ఆల‌యం అంగ‌రంగ ముస్తాబ‌యింది. ఆల‌యం విద్యుత్ కాంతుల‌తో మెరిసిపోతుంది. ఈ వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో విశిష్ట‌మైన‌ది వాహ‌న‌సేవ‌లు.

ఈ బ్ర‌హ్మోత్స‌వాలు మొత్తం 13 రోజుల‌పాటు నిర్వ‌హిస్తారు. మ‌హాశివ‌రాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. ఈ క్ర‌మంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి స‌మ‌స్య‌లు తలెత్తకుండా త‌గు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Srikalahasti is recommended for the annual Brahmotsavam of Mahashivratri

ఈ ప‌ద‌మూడు రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహన సేవ కార్య‌క్ర‌మం ఉంటుంది. శ్రీ‌కాళ‌హ‌స్తి ఆల‌యం ఇప్ప‌టికే రంగ‌వ‌ల్లిక‌ల‌తో ఎంతో ఆక‌ర్షిణీయంగా ముస్తాబు చేశారు. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా భ‌క్తులు వాహన సేవలను తిలకించి ముక్తి పొందాల‌ని కోరుకుంటారు. అందుకోసం వేలాది సంఖ్య‌లో భ‌క్తులు బారులు తీరుతారు. తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించారు.

ఈ సంద‌ర్భంగా భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ ఎంతో వైభ‌వంగా జరిగింది. వాహ‌న‌సేవ‌పై ఊరేగుతున్న స్వామి వారిపై భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ ప‌లువురు పాల్గొన‌డం జ‌రిగింది.

శ్రీ క‌ళ్యాణ‌ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు: శ్రీనివాసమంగాపురం శ్రీ క‌ళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘ‌నంగా జ‌రిగాయి. మూడో రోజైన శ‌నివారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు బకాసుర వధ అలంకారంలో ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చాడు.

మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ ఉత్స‌వాలు గ‌జ‌రాజులు ఎంతో ఆకర్ష‌ణ‌గా నిలిచాయి. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించాయి. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ ఎంతో వైభ‌వంగా జరిగింది. భక్తులు స్వామివారి ద‌ర్శనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+