శ్రీకాళహస్తి ఆలయంలోని ప్రసాదాల‌ త‌యారీ కేంద్రంలో అగ్నిప్రమాదం..!!

శ్రీకాళహస్తి ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ దక్షిణ గోపురం పక్కనే ఉన్న ప్రసాదాల తయారీ కేంద్రంలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్వామివారికి నైవేద్యంగా, భక్తుల కోసం లడ్డూ ప్రసాదాలతో పాటు వడలు, అన్నప్రసాదాలు తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందు కున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు చర్యలు చేపట్టారు.

Viral Video: ఆలయ గర్భగుడి తెరవగానే పూజారికి ఊహించని షాక్‌.. భయంతో పరుగులు తీసిన అర్చకుడు
Viral Video: ఆలయ గర్భగుడి తెరవగానే పూజారికి ఊహించని షాక్‌.. భయంతో పరుగులు తీసిన అర్చకుడు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలోని ప్రసాదాల‌ త‌యారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ గోపురం పక్కనున్న‌ ప్రసాదాల తయారీ కేంద్రంలో గ్యాస్ లీక్ కావడ‌మే ప్ర‌మాదానికి కార‌ణంగా తెలుస్తున్న‌ది. స్వామివారికి లడ్డూ ప్రసాదాలతోపాటు అన్నప్రసాదాలు తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా చుట్టూ మండపాల్లో ఉన్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

Srikalahasti Temple Prasadam Centre Catches Fire After Gas Leak here the full details

ఆలయ ఈవో వెంకటేశులు, ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రస్తుతానికి ప్రసాదాల తయారీని నిలిపివేసి, అక్కడ అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.

కాగా, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా మరియు చుట్టుపక్కల మండపాల్లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా అధికారులు ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆలయ ఈవో వెంకటేశులు, ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతానికి ప్రసాదాల తయారీని తాత్కాలికంగా నిలిపివేసి, కేంద్రంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లను అధికారులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవస్థానం ఈవో తో పాటు సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ లో ఇలాంటివి చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+