టిడిపి మైండ్ గేమ్: శ్రీకాంత్ రెడ్డి, రోజాను కంట్రోల్ చేయాలని జగన్‍కు!
తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి బుధవారం కొట్టి పారేశారు. తాను వైసిపిలోనే ఉంటానని తేల్చి చెప్పారు.
అమరావతి: తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి బుధవారం కొట్టి పారేశారు. తాను వైసిపిలోనే ఉంటానని తేల్చి చెప్పారు.

అంతా అబద్దం
తాను పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోందని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను జగన్ వెంటే ఉంటానన్నారు. కావాలని తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని ధ్వజమెత్తారు. వైసిపి మనోధైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

రోజా వ్యాఖ్యలు కూడా దెబ్బతీశాయా?
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఓటమిలో వైసిపి నేతలు చేసిన వ్యాఖ్యల ప్రభావం కూడా ఉందనే వాదనలు ఉన్నాయి. సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన కాల్చివేత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేశాయని అంటున్నారు. అలాగే, మంత్రి అఖిలప్రియపై రోజా చేసిన వ్యాఖ్యలు కూడా దెబ్బతీశాయని అంటున్నారు.

రోజాను కంట్రోల్ చేయాలని..
అఖిలప్రియ డ్రెస్సింగ్ పైన రోజా చేసిన వ్యాఖ్యలు సరికాదని వైసిపి నేతలే గుసగుసలాడుకున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని జగన్‌కు కూడా చెప్పారని అంటున్నారు. రోజాను కంట్రోల్ చేయాలని, వ్యక్తిగత దూషణలతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.

వైసిపికి ఘోర ఓటమి
కాగా, నంద్యాలలో లక్షా 73 వేల మంది ఓటు వేశారు. అందులో 89 వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు చాలామంది వైసిపికి వ్యతిరేకంగా ఓటు వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి చేతిలో వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి 27వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications