• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కడప ప్రజలపై అలాంటి వ్యాఖ్యలా?: సారీ చెప్పాలన్న శ్రీకాంథ్ రెడ్డి, క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేవారు. క‌డ‌ప ఎయిర్‌పోర్టు విష‌యంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లపై మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు.

సోము వీర్రాజు క్షమాపణలు చెప్పాలి: శ్రీకాంత్ రెడ్డి

సోము వీర్రాజు క్షమాపణలు చెప్పాలి: శ్రీకాంత్ రెడ్డి

కడప ప్రజలు మనుషులను చంపుతారని వారికి ఎయిర్ పోర్టు అవసరమా? అని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు శ్రీకాంత్ రెడ్డి. సోము వీర్రాజు తన మాటలు వెంట‌నే వెనక్కు తీసుకోవాలని, క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.
లాభాల కోసం సినిమాల్లో ఆ ప్రాంత సంస్కృతిని దిగజార్చార‌ని మండిప‌డ్డారు శ్రీ‌కాంత్ రెడ్డి. కడప ప్రాంతంలో బీజేపీ జెండా పట్టుకుని తిరిగే వారున్నారు.. వాళ్లయినా, సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడాల‌న్నారు.

రాయలసీమ ప్రజలను ఫ్యాక్షనిస్తులుగా చిత్రీకరణ: శ్రీకాంత్ రెడ్డి ఫైర్

రాయలసీమ ప్రజలను ఫ్యాక్షనిస్తులుగా చిత్రీకరణ: శ్రీకాంత్ రెడ్డి ఫైర్

రాయల సీమ ప్రజలను ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరణ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఎఫ్ఐఆర్‌లు నమోదు అవుతూన్నాయో సోము వీర్రాజు చూడాల‌ని హిత‌వుప‌లికారు. వెంట‌నే ఆయ‌న వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. రాయల సీమ సంస్కృతిని సినిమాల్లోనే కించపరిచేలా వ్యవహరించార‌ని.. టీడీపీ తన పబ్బం గడుపుకోవడం కోసం ఫ్యాక్షన్ గొడవలు రేపింద‌ని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. మద్దెలచెరువు సూరికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు తిరస్కరించిన ఘనత వైఎస్‌ది అని గుర్తుచేశారు. టీడీపీ పెట్టె వ్యూహాత్మక సమావేశాలకు కుట్ర మీటింగ్‌లని పేరు పెట్టుకోవాల‌ని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రాణాలు తీసేవాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌పోర్టు: సోము వీర్రాజు వివరణ

ప్రాణాలు తీసేవాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌పోర్టు: సోము వీర్రాజు వివరణ

'ఇటీవల ముఖ్యమంత్రి జగన్ జిల్లాకొక ఎయిర్ పోర్ట్ అంటూ చేసిన వ్యాఖ్యల పట్ల నిన్న విశాఖపట్టణంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో స్పందిస్తూ, కనీసం రోడ్డు మీద ఉన్న గుంతను కూడా పూడ్చలేని వాళ్లకు ఎయిర్ పోర్టుల సంగతి ఎందుకు, బస్సు వెళ్లలేని చోట కర్నూలులో ఎయిర్ పోర్టు నిర్మించాం' అని సోము వీర్రాజు తెలిపారు. కడపలో ఎయిర్ పోర్టును నిర్మించాం, ప్రాణాలు తీసేసే వాళ్ళ జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు, వాళ్లకు ప్రాణాలు తీసేయడమే వచ్చు, మేము ఎయిర్ పోర్టు వేస్తాం, వీళ్ళేస్తారంట ఎయిర్ పోర్టు. (ప్రియతమ నాయకులు వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గురించి, అధికారంలో ఉండి కూడా సొంత బాబాయిని హత్య చేసిన వారిని గుర్తించి వారికి శిక్ష వేయించకుండా, ఇంత కాలంగా హత్యకు పాల్పడిన వారిని ముఖ్యమంత్రి జగన్ రక్షిస్తున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా మాట్లాడిన మాటలు) ముందు మీరు సరైన రోడ్లేయండి, ఎయిర్ పోర్టుల సంగతి మేము చూసుకుంటాం అని మాట్లాడాను అని సోము వీర్రాజు వివరణ ఇచ్చారు.

కడప జిల్లా ప్రజలను కాదంటూ సోము వీర్రాజు క్లారిటీ

కడప జిల్లా ప్రజలను కాదంటూ సోము వీర్రాజు క్లారిటీ

అంతేకానీ, నేను ఎక్కడా కడప జిల్లా ప్రజల గురించి తప్పుగా మాట్లాడలేదు, కేవలం ఆ కొంతమంది వ్యక్తుల మీద వస్తున్న వార్తల ఆధారంగా, కేవలం వారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా మాట్లాడిన మాటలను తప్పుదోవ పట్టించి, వారిని గురించి మాట్లాడిన కారణంగా, ఇలా మొత్తం కడప జిల్లా ప్రజలను హత్యలకు ఆపాదించినట్లు వైసీపీ నాయకులు కావాలని చిత్రీకరిస్తున్న తప్పుడు వార్తలను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. కడప జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయత, సంస్కృతి, సాంప్రదాయాలు, నమ్మితే ప్రాణమిచ్చే వారి తెగింపు ఇవన్నీ బాగా తెలిసినవాడిని, ఇందులో కడప జిల్లా ప్రజలకు మరెవరూ సాటిరారు. అది జగమెరిగిన సత్యం. అలాంటి ఉన్నతమైన విలువలు కలిగిన ప్రజల గురించి నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడను,ఆలోచించను.
కడప జిల్లా ప్రజలకు మోసపోవటమే తెలుసు కానీ, మోసం చేయడం తెలియని వారు. అందుకే ఇన్ని సంవత్సరాలుగా కడప జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా జగన్ కుటుంబాన్ని ఆదరిస్తూ పదే పదే మోసపోతున్నారు. ఇకనైనా వారి మాయనుంచి జిల్లా ప్రజలు బయటపడి అభివృద్ధి వైపు పయనించాలని ఆకాంక్షిస్తున్నాను. కడప జిల్లాకు ఎయిర్ పోర్టుతో పాటు అనేక జాతీయ రహదారులను నిర్మించి, వెనుక బడిన జిల్లా క్రింద వందల కోట్ల నిధులను ఇచ్చి, అన్ని వర్గాలప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నది బీజేపీ ఆధ్వర్యంలోని మోదీగారి ప్రభుత్వం మాత్రమే.రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకివస్తూనే జిల్లాను మరింతగా అభివృద్ధి చేస్తామని హామీఇస్తున్నాను. వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని జిల్లా ప్రజలను అభ్యర్థిస్తున్నాను అని సోము వీర్రాజు తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.

English summary
Srikanth Reddy slams Somu Veerraju for comments on kadapa and ys jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X