వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యాంగేతర శక్తి: లోకేష్‌ను దులిపేసిన శ్రీకాంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikanth Reddy terms Nara Lokesh as extra constitutional authority
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా మారారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపిచారు.

నష్టాలను బూచీగా చూపి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆర్టీసి, జెన్కోలను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 84 ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడితే వాటిలో 54 చంద్రబాబు హయాంలోనే మూతపడ్డాయని ఆయన అన్నారు. తనవారికి కట్టబెట్టేందుకే చంద్రబాబు కమిటీలు ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.

పాలేరు షుగర్స్‌ను చంద్రబాబు మదుకాన్ సంస్థకు కారు చౌకగా కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పరంగా సంస్థలను పచ్చ చొక్కాలకు అప్పజెప్పారని ఆయన అన్నారు. మళ్లీ ఇప్పుడు అదే పంథాలో సాగుతున్నారని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే జీవో నెంబర్ 289, 290 పేరుతో కోవూరు షుగర్ ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు .

ప్రభుత్వ రంగ సంస్థల్లో పందికొక్కుల్లా దోచుకు తింటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రైవేటీకరణను తమ పార్టీ అడ్డుకుంటుందని ఆయన చెప్పారు. ప్రైవైటీకరణను చంద్రబాబు గొప్పగా చెప్పుకోవడం దారుణమని ఆయన అన్నారు.

English summary

 YSR Congress party MLA Srikanth Reddy has termed Andhra Pradesh CM and Telugudesam party president Nara Chandrababu Naidu's son Nara Lokesh as extra constitutional authority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X