తప్పు చేయలేదు: జగన్ కేసులో కోర్టుకు ఎన్ శ్రీనివాసన్

కోర్టుకు హాజరైన సందర్భంగా శ్రీనివాసన్ మాట్లాడారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని ఆయన చెప్పారు. తమ నిజాయితీని న్యాయస్థానంలో నిరూపించుకుంటామని చెప్పారు. సిబిఐ విచారణ జరుపుతోందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని శ్రీనివాసన్ తెలిపారు.
కాగా, ఆస్తుల కేసు కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణలతో పాటు వైయస్ జగన్, విజయ సాయి రెడ్డి గురువారం కూడా నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యారు. ఆయా చార్జిషీట్లలో సమన్లు అందుకున్న ఇతర నిందితులు కూడా కోర్టుకు వచ్చారు.
వీరిని డిసెంబర్ 3న తిరిగి హాజరు కావాలని సిబిఐ రెండో ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి పదోన్నతిపై హైకోర్టుకు వెళ్లడంతో ఏర్పడిన ఖాళీ ఇంకా భర్తీ చేయని నేపథ్యంలో, సిబిఐ రెండో కోర్టు న్యాయమూర్తి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications