శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం - ఆన్​ లైన్ లో టికెట్లు, ఇవి అవసరం..!!

శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆలయ అధికారులకు శుభవార్త. భక్తులకు తిరిగి ఆలయంలో స్పర్శ దర్శనం అందుబాటులోకి తెచ్చారు. జూలై ఒకటో తేదీ నుంచి మొదలైన ఈ ఉచిత స్పర్శ దర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. దీంతో, భక్తుల కోసం ఆన్ లైన్ లో ఉచిత స్పర్శ దర్శన టోకెన్లను అందుబాటులోకి తెస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్లను వెల్లడించారు. ఆలన్ లైన్ లో టోకెన్ల కోసం విధి విధానాలను ఖరారు చేసారు.

ప్రముఖ శైవ క్షేత్రం శ్రైశైలంలో మహా శివుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. చాలా మంది సామాన్య భక్తులు కేవలం సర్వదర్శనం ద్వారా మాత్రమే శివయ్యను దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ఇప్పటికే ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభించారు. ఈ దర్శ నానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన రావడంతో రద్దీ కూడా అదే స్థాయిలో పెరిగింది. దీంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టోకెన్ పద్ధతిని ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఇవి కూడా ఆన్​ లైన్ ద్వారా జారీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబం ధించి విధి విధానాలను వెల్లడించారు. వెబ్ సైట్ల వివరాలను ప్రకటించారు.

srisialam-temple-key-announcement-over-sparsha-darshanam-tokens

ఉచిత స్పర్శ దర్శనం కోసం వచ్చేవారం నుంచే టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ ఉచిత స్పర్శ దర్శన అవకాశం ప్రతీ మంగళవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 గంటల నుండి సాయంత్రం 3 గంటలా 45 నిమిషాల వరకు అందుబాటులో ఉంటుంది. www.aptemples.ap.gov.in , www.srisailadevasthanam.org వెబ్‌సైట్‌ల నుంచి ఈ ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లు పొందాలాలని అధికారులు భక్తులకు సూచించారు. ఉచిత స్పర్శ దర్శనం టోకెన్ పొందాలనుకునే వారు ఆన్​లైన్​లో పలు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. టోకెన్ కావాలనుకునే భక్తులు దేవస్థానం సూచించిన వెబ్ సైట్లలోకి వెళ్లిన తర్వాత వారి పేరు, ఆధార్ నంబర్‌, చిరునామా వంటి వివరాలను నమోదు చేయాలి.

రద్దీ.. అందుబాటును బట్టి టికెట్లను జారీ చేస్తారు. ఇక, ఈ టోకెన్లను దర్శనానికి ఒక రోజు ముందుగానే పొందవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసినవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని భక్తులు మల్లికార్జున స్వామి సేవలో తరించాలి. ఆలయ ఈవో సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+