తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం టోకెన్లు జారీ, ఎన్నారైలకు గుడ్‌న్యూస్
ఫిబ్రవరి 11న తిరుపతి స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఫిబ్రవరి 9న తిరుపతిలో టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)వెల్లడించింది. ఫిబ్రవరి 9న తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.
ఫిబ్రవరి 4న రథసప్తి నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని మొదటి మంగళవారం నుంచి రెండో మంగళవారానికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే తాజాగా 11న దర్శనం కోసం ఆదివారం టోకెన్లు జారీ చేస్తున్నారు.

ప్రవాసులకు టీటీడీ తీపి కబురు
ప్రవాస భారతీయ(NRI) భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే ప్రవాస భారతీయులకు భారీ వెసులుబాటు కల్పించింది. ఇకపై రోజుకు 100 మంది వీఐపీ దర్శనాలకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు రోజుకు 50 మంది ఎన్నారైలకు మాత్రమే వీఐపీ దర్శనం చేసుకునే అవకాశం ఉండేది.
ఎన్నారై భక్తుల వినతుల మేరకు ఆ సంఖ్యను 100 మందికి పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్నారైలు తమ కుటుంబసభ్యులతో కలిసి సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. టీటీడీ నిర్ణయంతో ఎన్నారై భక్తులు ఆనందం వక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీకీ ధన్యవాదాలు చెబుతున్నారు.
శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష
తిరుమలలో ఫిబ్రవరి 12వ తేదిన జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి శుక్రవారం తిరుమల గోకులం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థ ఉత్సవాలలో ఒకటైన రామకృష్ణతీర్థ ముక్కోటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
భక్తుల కోసం షామియానా, రేడియో బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. టీటీడీ భద్రతాసిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం భద్రత, అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం, ఆరోగ్యం, అటవీ విభాగాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.
పాపవినాశనం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీకి అవసరమైన శ్రీవారి సేవకులను నియమించాలని కోరారు. అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులను, వృద్ధులను అనుమతించబోమని తెలియజేశారు. తీర్థం వద్ద పూజలు సకాలంలో పూర్తి చేయాలని ఆలయ సిబ్బందిని ఆదేశించారు.
కాగా, గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఎపిఎస్ఆర్టీసీ నుండి బస్సులను ఏర్పాటు చేసెలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతించనున్నట్లు తెలిపారు.
-
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications