చంద్రబాబు వల్ల ఆ హీరోయిన్ జీవితం నాశనం

ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్ది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా నటుడు, వైసీపీ సానుభూతిపరుడు , ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం మీడియా సమావేశంలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు తీరును ఎండగట్టారు. చంద్రబాబు వ్యవస్థలన్నింటిని భ్రష్టుపట్టించారని విమర్శించారు. నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పింఛన్లు అందకుండ చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

star heroine s life was destroyed by Chandrababu

గతంలో గోనె సంచులు మోసుకునే ఉద్యోగం అని ఎద్దెవా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు వారికి రూ.10,000 జీతాలిస్తానని వారి కాళ్లు పట్టుకుంటున్నారని పోసాని ఎద్దెవా చేశారు. మగవాళ్లు లేనప్పుడు వాలంటీర్లు ఇండ్ల తలుపులు కొట్టేవారని.. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవారంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. వాలంటీర్లు నీ కొడుకు నారా లోకేశ్‌లా తాగుబోతులు, తిరుగుబోతులు కాదని స్పష్టం చేశారు.

star heroine s life was destroyed by Chandrababu

వాలంటీర్లపై చంద్రబాబుది మొసలి కన్నీరని..ఆయన సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని పోసాని కృష్ణమురళి అన్నారు. ఎన్టీఆర్ హయంలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశారని పోసాని ఆరోపించారు. జయప్రద లాంటి పెద్ద హీరోయిన్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేశాడని ..ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతిని బజారుకు ఈడ్చాడని అన్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా పోసాని నిప్పులు చెరిగారు.అసలు అది ఒక పార్టీయేనా? అని ఎద్దేవా చేశారు.గేదెలు కాచుకునేవాడు కూడా పవన్‌ కళ్యాణ్‌ మాటలు నమ్మరని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+