విభజన సమస్యలు అక్కడ ప్రస్తావిస్తాం, బెదిరేది లేదు: యనమల హెచ్చరిక
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో విభజన సమస్యలను ప్రస్తావిస్తానని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం నాడు చెప్పారు.
విజయవాడ: దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో విభజన సమస్యలను ప్రస్తావిస్తానని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం నాడు చెప్పారు. నియోజకవర్గాల పెంపు ఆవశ్యకతను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు.
అందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతామన్నారు. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తుల విభజనను ప్రస్తావిస్తామన్నారు. పొరుగు రాష్ట్రాలతో ఉన్న ఇబ్బందులను పరిష్కరించమని కోరుతామన్నారు. భవన నిర్మాణ నిబంధనల మార్పులతోనే మురికివాడల అభివృద్ధి సాధ్యమన్నారు. సీఆర్డీఏ పరిధిలోని నిర్మాణాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు తీసుకు వస్తామని చెప్పారు.

కాంట్రాక్ట్ అధ్యాపకులు సమ్మె చేస్తే బెదిరేది లేదని తేల్చి చెప్పారు. సుప్రీం కోర్టు నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగులు 26వేలకు పైగా ఉన్నారని, ఇబ్బందులున్నా ఔట్ సోర్సింగ్, వివిధ రంగాల్లోని ఉద్యోగుల న్యాయపరమైన కోర్కెలను తప్పకుండా తీరుస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై న్యాయ సలహా తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications