విశాఖ తీరానికి కొత్త సొగసు: జియో ట్యూబులతో కోతకు అడ్డుకట్ట (ఫోటోలు)
అమరావతి: విశాఖపట్నంలో సాగర తీరం కోతకు గురి కాకుండా విశాఖ పోర్టుట్రస్ట్ సరికొత్త చర్యలు చేపట్టింది. నిన్న, మొన్నటి వరకు బీచ్ కొతకు గురైతే ఆయా ప్రాంతాల్లో మట్టిని ఫిల్లింగ్ చేసేవారు. అలలు ఉద్ధృతంగా వచ్చినపుడు మట్టి తిరిగి సముద్రంలోకి కొట్టుకుపోయేది.
కాబట్టి దీని వల్ల పెద్దగా ప్రయోజనం లేదని భావించిన అధికారులు శాశ్వత పరిష్కారానికి చెన్నైకి చెందిన ఎన్‌ఐఒటి నిపుణుల బృందంతో సర్వే జరిపించారు. ఈ బృందం వారం రోజుల పాటు విశాఖ తీరాన్ని పరిశీలించి సముద్రంలో అలలు ఏయే సమయంలో, ఎంత తీవ్రతతో వస్తున్నాయో గుర్తించారు.

జియో ట్యూబులతో కోతకు అడ్డుకట్ట
అంతేకాదు ఏ ప్రాంతంలో సముద్ర తీరం ఎక్కువగా కోతకు గురవుతోంది.. గతంలో పరిస్థితి ఎలా ఉండేది.. తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని తీర ప్రాంతంలో కోత నివారణకు పలు సూచనలు చేసింది. ఈ బృందం సూచనల మేరకు జియో ట్యూబ్‌లతో మాత్రమే దీనికి అడ్డుకట్ట వేయగలమని భావించి, ఇందుకు సంబంధించి చర్యలు ప్రారంభించారు.

జియో ట్యూబులతో కోతకు అడ్డుకట్ట
జియో ట్యూబుల్లో ఇసుక నింపి తీరం వెంబడి అమర్చుతారు. దీనివల్ల అలల ఉద్ధృతి తగ్గడమేగాకుండా తీరంలో ఉన్న ఇసుక కోతకు గురికాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా శాశ్వతంగా బీచ్ కోతను నివారించగలమని భావిస్తున్నారు.

జియో ట్యూబులతో కోతకు అడ్డుకట్ట
గతేడాది సంభవించిన హూదూద్ తుఫాన్ సమయంలో తీరప్రాంతం కోతకు గురికావడంతో ఆర్కే బీచ్ వెంబడి ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ తరువాత కూడా ఆర్కే బీచ్‌లో పలుమార్లు కోతకు గురైంది. మరోపక్క వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖపట్నంలో నిర్వహించనున్న అంతర్జాతీయ నావికాదళ విన్యాసాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

జియో ట్యూబులతో కోతకు అడ్డుకట్ట
ఇటువంటి పరిస్థితుల్లో కురుసుర సబ్‌మెరైన్ ఉన్న ప్రాంతంలో సముద్ర తీరం మరింత ఎక్కువగా కోతకు గురికావటంతో, ఆ ప్రాంతం నుంచే జియో ట్యూబులను అమర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఏది ఏమైనప్పటికీ బీచ్ కోత నివారణకు అధికారులు చర్యలు ప్రారంభించటంతో స్థానికులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications