స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్రణాళిక ఖరారు..!!

ఆందోళనలు..అనుమానాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. సెయిల్ లో ప్లాంట్ ను విలీనం చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. కేంద్రం ఈ డిమాండ్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో ప్లాంట్ ఆర్దిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. కేంద్రం అందిస్తున్న సహకారం ఏ మాత్రం సరిపోవటం లేదు. తాజాగా స్టీల్ ప్లాంట్ అప్పుల పైన కీలక ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా కీలక చర్చలు జరుగుతున్నాయి.

పెరిగిన భారం
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆర్దిక సమస్యలు వెంటాడుతున్నాయి. జీతాలు సైతం పూర్తిగా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. సగం జీతాలు మాత్రమే ఇస్తున్నారు. ప్లాంటులో ఇప్పుడు 4వేల టన్నులకు మించి ఉత్పత్తి జరగడం లేదు. దీనివల్ల స్థిరవ్యయాలు భారంగా మారి ప్లాంటు నెత్తిన అప్పుల భారం పెరిగిపోతోంది. నిర్వహణ మూలధనం సమకూర్చాలని, ముడి పదార్థాలైన ఇరన్‌ ఓర్‌, కోకింగ్‌ కోల్‌ అందించాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు చాలాకాలం నుంచి డిమాండ్‌ చేస్తున్నాయి. ఇవీ చేయకుంటే సెయిల్ లో విలీనం చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది.

Steel plant Debts of Rs 7 500 cr likely to be declared as non-performing assets

విలీనం చేయాలంటూ
అయితే, స్టీల్ ప్లాంట్ విలీనం చేయాలంటే సాంకేతిక సమస్యలు ఉన్నాయని..సెయిల్ తో పాటుగా కేంద్రం అంగీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంటును ఆనుకుని ఉన్న అదానీ గంగవరం పోర్టు ద్వారా సెయిల్‌ కోకింగ్‌ కోల్‌ను విదేశాల నుంచి తెప్పించుకుంటోంది. స్టీల్‌ప్లాంటు విలీనానికి ఆమోదం తెలిపితే కోకింగ్‌ కోల్‌ సమస్య తీరిపోతుంది. పక్క పోర్టులో ఉన్న సరుకును ఉపయో గించుకోవచ్చని కార్మిక సంఘాల నేతలు సూచిస్తున్నారు. స్టీల్‌ప్లాంటు తక్షణం ఊపిరి పీల్చుకునే విధంగా ఇప్పటికే రూ.500 కోట్లు గ్రాంటుగా సమకూర్చింది. వీటిని చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని ఆదేశించింది.

నిరర్థక ఆస్తులుగా
కేంద్ర ఆ తరువాత మరో 1,140 కోట్లు సమకూర్చింది. అయితే ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ కు 35వేల కోట్ల అప్పులు ఉన్నట్టు తేల్చారు. బ్యాంకులకు రూ.18వేల కోట్లు బకాయి ఉంది. దీనిలో ఎస్‌బీఐకే రూ.10,500కోట్లు ఇవ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో, స్టీల్‌ప్లాంటు నిలదొక్కుకోవడానికి ఉక్కుశాఖ తాజాగా పునరుద్ధరణ ప్రణాళిక రూపొందించింది. దానిని డిసెంబరులో అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగా అప్పుల్లో రూ.7,500 కోట్లను నిరర్థక ఆస్తులుగా పేర్కొని రద్దు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో ప్లాంటు నడపడానికి ముడిపదార్థాలు ఎలా సమకూరుస్తారనేది స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+