తల్లితో సహజీవనం: ఇద్దరు కూతుళ్లపై పెంపుడు తండ్రి రేప్

ఓ వ్యక్తి అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. తల్లితో సహజీవనం చేస్తూ ఆమె ఇద్దరు కూతుళ్లపై అతను అత్యాచారం చేశాడు. ఈ సంఘటన తిరుపతిలో జరిగింది.

తిరుపతి/ అనంతపురం: ఓ వ్యక్తి ఇద్దరు పెంపుడు కూతుళ్లపై నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. వారిపై అతను అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకుని బాలికల తల్లి తీవ్ర వేదనకు గురై, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి రూరల్‌ మండలం మల్లంగుంట ఎస్వీనగర్‌కు చెందిన లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కొన్నేళ్ల క్రితమే భర్త మరణించాడు. దీంతో ఒంటరిగా జీవిస్తున్న క్రమంలో వంశీ అనే వ్యక్తి పరిచయం పెంచుకుని సహజీవనం చేసేవాడు. అప్పటికే మొదటి భర్తతో లక్ష్మికి ఇద్దరు బాలికలున్నారు.

Step father rapestwo girls at Tiruapthi

వంశీ నెల క్రితం తల్లి ఇంట్లో లేని సమయంలో ఇద్దరు బాలికల్లో ఒక బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత మరో బాలికను కూడా బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు బాలికలు గత కొన్ని రోజులుగా మథనపడుతూ వస్తున్నారు. తల్లి గమనించి వారిని అసలు విషయం ఏమిటని అడిగింది.

దాంతో పెంపుడు తండ్రి ఆఘాత్యం గురించి వారు తల్లికి వివరించారు. తల్లి రెండు రోజుల క్రితం బాలికలతో కలిసి వచ్చి ఎంఆర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు వంశీ కోసం గాలింపు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

అనుమానంతో భార్యను చంపి భర్త

అనుమానంతో ఓ వ్యక్తి భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రానికి చెందిన షేక్షావలి, రేష్మిలు భార్య భర్తలు. వీరికి ముగ్గరు పిల్లలు ఆషిపా(11) షాజియా(9)సాదిక్(4)లు ఉన్నారు. అయితే గత కొద్దిరోజులుగా వీరి కుటుంబంలో కలహాలు ప్రారంభమయ్యాయి.

దీనికి తోడు రేష్మిపై షేక్షావలికి అనుమానం ఏర్పడింది. ఈ నేపధ్యంలో గురువారం రాత్రి రేష్మిపై కిరోసిన్ పోసి నిప్పింటించాడు. దీంతో కాలిన గాయాలతో ఆమె మృతి చెందింది. పోలీసులు షేక్షావలిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+