చిరుపై రాళ్ల దాడి, పోలీస్ సాయంతో తప్పించుకున్నారు
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి మంగళవారం సమైక్య సెగ తగిలింది. ఆయన తుఫాను బాధితులను పరామర్శించేందుకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయాలంటూ పలువురు సమైక్యవాదులు ఆయన పైన రాళ్ల దాడి చేశారు. జిల్లాలోని శ్రీకాకుళం జిల్లాలో పలువురు ఆయనను అడ్డుకున్నారు. చిరుకు, కాంగ్రెసుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓ దశలో వాళ్లు రాళ్లతో రువ్వారు.
పరిస్థితిని గుర్తించిన పోలీసులు చిరంజీవిని అక్కడి నుండి తప్పించారు. పోలీసుల సాయంతో ఆయన బయటపడ్డారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన చిరంజీవి బాధితులకు పరిహారం అందేలా చూస్తామని చెప్పారు. పత్తి రైతులకు బీమా సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు.

పార్థసారథి సంచలన వ్యాఖ్యలు
మంత్రి పార్థసారథి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో తమ పార్టీ ములాకత్ అయినట్లుగా కనిపిస్తోందన్నారు. తన లాంటి కాంగ్రెసువాదికే అలా అనిపిస్తే మిగిలిన వారికి ఎందుకు అనిపించదని ప్రస్నించారు. అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చి మరో తప్పు చేస్తుందనుకోనని చెప్పారు. 2014 లోపు విభజన జరగదనిపిస్తోందన్నారు.
ప్రత్యేక పార్టీ ఆలోచన లేదు
సమైక్యాంధ్ర పేరిట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని మంత్రి శైలజానాథ్ హైదరాబాదులో అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కిరణ్ అన్ని ప ్రయత్నాలు చేస్తున్నారని, తాము కూడా చివరి వరకు పోరాడుతామన్నారు. తాము పరకాలలో ఓ మాట, ఇడుపులపాయలో ఇంకోమాట, మరోచోట మరో మాట చెప్పలేదన్నారు. విభజన జరగదనే తాము ఆశిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications