రెండుతలలతో వింత గొర్రెపిల్ల జననం .. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారంటూ.. చూసేందుకు ఎగబడ్డ జనం!!
సృష్టిలో మనకు తెలియని, అర్థం కాని ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. ఇక ఆ వింతలను చూసి ఎవరికి వారు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. కొందరు సైంటిఫిక్ కారణాలు చెప్తే, మరికొందరు విభిన్నమైన కారణాలు చెబుతూ చర్చకు కారణమవుతారు. ఇక అటువంటి వింతనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మవరంలో చోటుచేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ధర్మవరం గ్రామంలో రెండు తలలతో ఒక వింత గొర్రె పిల్ల పుట్టింది. ఇంకేం దరిమిలా ఆ విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించింది.
రైతుకు చెందిన గొర్రెకు రెండు తలల గొర్రెపిల్ల జననం
ధర్మవరం గ్రామంలో రైతు పంపనబోయిన వెంకన్న పెంచుకుంటున్న గొర్రెల మందలో ఒక గొర్రెకు రెండు తలలున్న గొర్రె పిల్ల జన్మించింది. ప్రస్తుతం ఆ గొర్రె పిల్ల ఆరోగ్యంగానే ఉందని రైతు చెప్పాడు. అయితే రెండు తలలు ఉన్న గొర్రె పిల్ల జన్మించటం అక్కడ స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వింత ను చూడటం కోసం జనం బారులు తీరుతున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా జనాలు వచ్చి ఈ వింత గొర్రె పిల్లను చూస్తున్నారు.

బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజం అవుతుందని చర్చ
వివిధ జన్యులోపాల కారణంగా ఇలాంటి గొర్రె పిల్లలు జన్మిస్తాయని పశు వైద్యులు చెప్తున్నారు. దీనిలో వింత ఏమీ లేదని, గతంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయని వైద్యులు చెబుతున్నారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక వింతలు జరుగుతున్నాయని జనాలు రెండు తలల గొర్రె పిల్లను ఉద్దేశించి చెప్పుకుంటున్నారు. కలికాలంలో ఇలాంటి వింతలే జరుగుతాయని చెబుతున్నారు. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజం అవుతుందంటూ స్థానికంగా చర్చించుకుంటున్నారు.

కలికాలంలో ఇలాంటి ఘటనలు జరుగుతాయని చర్చ .. వీడియో వైరల్
బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు అనేక ఘటనలు జరిగాయని వేప చెట్టుకు పాలు కారణం, నీళ్ళతో దీపాలు వెలగడం వంటి అనేక ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేసుకుంటున్నారు. కలికాలం అంతమయ్యే సమయంలో ఇటువంటి వింతలు జరుగుతాయి అని చెప్పుకుంటున్నారు. ఇక రెండు తలల గొర్రె పిల్ల జన్మించిన వింత కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications