ఇద్దరి మధ్య ఘర్షణ: పాఠశాలలో విద్యార్థి మృతి
తిరుపతి: తిరుపతిలో గురువారం ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. తరగతి గదిలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఒక విద్యార్థి మృతికి కారణమైంది. ఈ ఘటన తిరుపతిలోని ఓ పైవేట్ స్కూల్లో జరిగింది.
గోవిందరాజస్వామి దక్షిణ మాఢవీధిలో ఉన్న పాఠశాలలో గురువారం మధ్యాహ్నం మోహన కృష్ణ అనే 10వ తరగతి విద్యార్థి రక్తపుమడుగులో పడిఉన్నాడు. విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగినట్లుగా గమనించిన నిర్వాహకులు విద్యార్థిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి చనిపోవడంతో విషయం బయటకు వచ్చింది.

విద్యార్థుల మధ్య తలెత్తిన ఘర్షణను దాచి పెట్టాలని ప్రయత్నిస్తున్న పాఠశాల యాజమాన్యం తరగతి గదిలో గ్లాస్ డోర్ పగలడంవల్లే మోహన్ కృష్ణ మృతి చెందినట్లు చెబుతోంది. గదిలో రక్తపుమరకలు, చెల్లాచెదురుగా పడిఉన్న పుస్తకాలను పోలీసులు పరిశీలించారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ఈ ఘటన జరిగిందని విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications