టీచర్లే రౌడీలై చితకబాదారు: చావు బ్రతుకుల మధ్య విద్యార్థి
ఉపాధ్యాయులే రౌడీలు అయిన వేళ. ఓ విద్యార్థి చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో కోన ఊపిరి తో కొట్టుమిట్టాడుతున్నాడు. విజయవాడలోని ఓ కార్పోరేట్ కాలేజిలో జరిగిన ఈ అమానుష ఘటనలో ఓ విద్యార్థి తీవ్రముగా గాయ పడ్డాడు.
విజయవాడ: ఉపాధ్యాయులే రౌడీలు అయిన వేళ. ఓ విద్యార్థి చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో కోన ఊపిరి తో కొట్టుమిట్టాడుతున్నాడు. విజయవాడలోని ఓ కార్పోరేట్ కాలేజిలో జరిగిన ఈ అమానుష ఘటనలో ఓ విద్యార్థి తీవ్రముగా గాయ పడ్డాడు. తల్లి లాంటి లాలన, తండ్రి లాంటి పాలన అన్న ఆ చోట మానవత్వం మంటకలిసింది.
ఉపాధ్యాయులు రౌడీల్లా ప్రవర్తించి తోటి విద్యార్థిని చితకబాది ఏం జరుగుతుందో చూద్దామని ఈ ఘటనకు పాల్పడ్డారని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.కాలేజీలో తొటి విద్యార్ధులతో జరిగిన గొడవ కారణంగా చింతా కళ్యాణ్ అనే విద్యార్ధి ని ఉపాధ్యాయులు చితక్కొట్టారని కళ్యాణ్ స్నేహితులు అంటున్నారు.

తీవ్రంగా గాయపడి న కళ్యాణ్ మనస్ధాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక పిన్నమనేని పాలిక్లినిక్ రొడ్డులో గల శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు కళ్యాణ్.
లెక్చరర్ తీవ్రంగా కొట్టడం వల్ల మనస్తాపం తో కాలేజీ బయట కు వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తోటి విద్యార్ధుల ఆరోపణలు బాగా ఉన్నాయి. శ్రీ కర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధి కళ్యాణ్ విషయంలో, ఆసుపత్రి వర్గాలు రాత్రి గడిస్తే కాని ఏ విషయం చెప్పలేమంటున్నారు.విద్యార్ధి ఆత్మహత్యానికి పాల్పడ్డా కాలేజి యాజమాన్యం స్పందించడం లేదంటూ ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున ఆందోలనకు దిగిన విద్యార్ధులు.












Click it and Unblock the Notifications