సర్టిఫికెట్ల కోసం బిటెక్ విద్యార్థి ఆత్మహత్యయత్నం

వివరాలు ఇలా ఉన్నాయి - మంగళవారం జెఎన్‌టియుకు వచ్చి అధికారులను కలిశాడు. దరఖాస్తు చేసుకున్న వెంటనే సర్టిఫికెట్లు అందజేయడం సాధ్యపడదని, కనీసం 15 రోజుల సమయం పడుతుందని, పోస్టు ద్వారా ఇంటికి పంపుతామని అధికారులు తెలిపారు. డిసెంబర్ 30లోగా యూకే వెళ్లవలసి ఉందని, వెంటనే సర్టిఫికెట్లు ఇచ్చేలా చూడాలని షోయబ్ వేడుకున్నాడు. సమయం పడుతుందని, తామేమీ చేయలేమని అధికారులు తేల్చి చెప్పడంతో షోయబ్ తన బ్యాగులో ఉన్న బ్లేడ్‌తో చేతి మణికట్టు కోసుకున్నాడు.
అది గమనించిన సిబ్బంది కెపిహెచ్‌బి పోలీసులకు సమాచారం అందించి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అక్కడికి చేరుకున్న విద్యార్థి జేఏసీ, ఏఐఎస్ఎఫ్ నాయకులు పరీక్షల విభాగం ముందు ఆందోళనకు దిగారు. షోయబ్‌కు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ పరీక్షల విభాగం అధికారి ఈశ్వరప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కెపిహెచ్‌బి సీఐలు గంగారాం, సురేందర్ అక్కడికి చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడి శాంతింపచేశారు. షోయబ్‌కు సర్టిఫికెట్లు వెంటనే వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications