అమ్మ తిట్టిందని విద్యార్థి ఆత్మహత్య (ఫొటోలు)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని మలక్‌పేటలో గల ఓ జూనియర్ కళాశాలలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఉరేసుకుని మంగళవారంనాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కళాశాలలో అతని తల్లి స్వీపర్‌గా పనిచేస్తోంది.

మృతుడిని 16 ఏళ్ల సాయిరామ్‌గా గుర్తించారు. హైదరాబాదులోని ముసారాం బాగ్‌లో ఉండే బాలయ్య కుమారుడు అతను. సికింద్రాబాదులోని పాఠశాలలో సాయిరామ్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తల్లి మలక్‌పేటలోని శ్రీ మేధా జూనియర్ కళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తోంది.

ఇటీవల సాయిరామ్ కళాశాల వాచ్‌మన్‌ సత్తిపండుకు, ఇతర స్థానికులకు సన్నిహితుడయ్యాడు. చాలా సమయం అతను వారితోనే వెచ్చిస్తున్నాడు. చదువును నిర్లక్షయం చేస్తుండడంతో సోమవారం రాత్రి తల్లి అతన్ని తిట్టింది. రాత్రి భోజనం చేసిన తర్వాత అతను తిరిగి ఇంటికి రాకుండా సత్తిపండు గదిలోనే ఉండిపోయాడు.

తెల్లారి మంగళవారం చూసే సరికి అతను కళాశాలలోని మూడో అంతస్థులోని తరగతి గదిలో ఊరేసుకుని కనిపించాడు. సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదు. సత్తిపండును ప్రశ్నించామని, అతనికి దీంతో ఏ విధమైన సబంధం లేదని పోలీసులు చెబుతున్నారు.

తల్లి తిట్టినందుకేనా..

తల్లి తిట్టినందుకేనా..

హైదరాబాదులోని మలక్‌పేటలో గల శ్రీమేధా కళాశాలలో సాయిరామ్ అనే బయటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి తిట్టినందుకే అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అంటున్నారు.

కడుపుకోత..

కడుపుకోత..

కుమారుడు మరణించడంతో బోరున విలపిస్తున్న తల్లి.. కడుపుకోత చెప్పనలవి కాదు.. శ్రీమేధా కళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న ఆమె కుమారుడిపైనే అన్ని ఆశలూ పెట్టుకుంది.

విషాద దృశ్యం...

విషాద దృశ్యం...

రాత్రి కళాశాల వాచ్‌మన్ సత్తిపండు గదిలో పడుకున్న సాయిరామ్ తెల్లారేసరికి తరగతి గదిలో ఉరేసుకుని కనిపించాడు.

ఆపితే ఆగేదా..

ఆపితే ఆగేదా..

కుమారుడి మరణంతో బోరున విలపిస్తున్న సాయిరామ్ తల్లిని ఊరడించడానికి ప్రయత్నిస్తున్న మరో మహిళ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+