ఏపీలో ఈ నెలలో 2 వరుస సెలవులు.. ఎంజాయ్
Holidays in Andhra Pradesh: ఏపీలో ఈ నెలలో రెండు వరుస సెలవులు రానున్నాయి. ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు తెరచుకోవు. రెండు వరుస సెలవులు రావడానికి ప్రధాన కారణం ఒకటి- మహా శివరాత్రి, రెండు- శాసన మండలి ఎన్నికలు. ఈ రెండూ కూడా ఈ నెల 26, 27 తేదీల్లో రానున్నాయి.
మహా శివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు.. అన్నీ మూతపడతాయి. ఆ మరుసటి రోజే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా 27వ తేదీని ఏపీ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.

మహా శివరాత్రికి రాష్ట్రంలోని అన్ని ఆలయాలు ముస్తాబు కానున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది, క్షీరారామం, సోమారామం, అమరేశ్వర స్వామి, అమరలింగేశ్వర స్వామి, కోటప్ప కొండ, యాగంటి, శ్రీముఖం, భైరవకోన, కోటిపల్లి, కపిలతీర్థం.. వంటి ఆలయాలకు భక్తులు పోటెత్తనున్నారు.
ఆ మరుసటి రోజే ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలవుతుంది. గుంటూరు-కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే షెడ్యూల్‌ను విడుదల చేసింది. 27వ తేదీన ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది.
దీనికోసం ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా ఆరంభమైంది. నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉంటుంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 13వ తేదీ. 27న పోలింగ్ ఉంటుంది. మార్చి 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.












Click it and Unblock the Notifications