సీఎం తో ముగిసిన సబ్ కమిటీ భేటీ..రాజధాని నిర్మాణంపై ఫోకస్..! వాయిదా పడ్డ ప్రజా దర్బార్..!!
అమరావతి/హైదరాబాద్ : సీఎం జగన్‌తో కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం ముగిసింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కేబినెట్ సబ్‌కమిటీ అధ్యయనం చేయనుంది. ఏఏ అంశాలపై దృష్టిపెట్టాలో కేబినెట్ సబ్‌కమిటీకి జగన్ సూచించారు. సోమవారం సెక్రటేరియట్‌లో వివిధ శాఖల అధికారులతో సబ్‌కమిటీ భేటీకానుంది. 45 రోజుల్లో ప్రాథమిక నివేదిక కేబినెట్ సబ్‌కమిటీ ఇవ్వనుంది. జగన్‌తో కేబినెట్ సబ్‌కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. 30 అంశాలపై విచారణకు కేబినెట్ సబ్‌కమిటీని జగన్ ఏర్పాటు చేశారు. రాజధాని పనులు, పోలవరం, గృహనిర్మాణంలో అవినీతిపై చర్చించినట్లు సమాచారం. సబ్ కమిటీ సభ్యులుగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్, కన్నబాబు ఉన్నారు.

ప్రజాదర్భార్ వాయిదా..! బడ్జెట్ సమావేశాల తరువాత అంటున్న మంత్రి..!!
అనివార్య కారణాల వల్ల ప్రజాదర్భార్ వాయిదా పడిందని, ఆగస్టు 1 నుంచి ప్రజాదర్భార్ నిర్వహిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. గత ప్రభుత్వ హయంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయని, అవినీతికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని మంత్రి కన్నబాబు వెల్లడించారు. అవినీతి జరిగిన ప్రతి అంశంపైనా విచారణ జరుపుతామని, ప్రతి నాలుగైదు రోజులకోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. 15 రోజులకోసారి సీఎం జగన్ సమీక్షిస్తారని, 45 రోజుల్లో ప్రాథమిక నివేదిక అందజేస్తామని కన్నబాబు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం..! ఆగస్టులో నిర్వహాస్తామన్న నేతలు..!!
సోమవారం నుంచి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభం కావాల్సిన ప్రజాదర్బార్ వాయిదా పడింది. తమ సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్‌కు వచ్చే వారి కోసం నిర్మించ తలపెట్టిన షెడ్‌లు పూర్తి కాకపోవడంతో అధికారులు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అయితే బడ్జెట్ సమావేశాల తరువాత ప్రజాదర్బార్‌ను నిర్వహించే అవకాశం ఉందని సీఎం క్యాంపు అధికారులు వెల్లడించారు.
ప్రజాదర్భార్ వాయిదా పడింది: మంత్రి కన్నబాబు

అవసరంలేని ప్రాజెక్ట్‌లు కూడా చేపట్టారు..! మండిపడ్డ ఆర్థిక మంత్రి..!!
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పరిపాలన అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పథకాలు, కార్యక్రమాల పేరుతో అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌లు, భూ కేటాయింపుల్లో భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అవసరంలేని ప్రాజెక్ట్‌లు కూడా చేపట్టారని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌కమిటీ విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు. రాజధాని భూములు, విశాఖ భూకుంభకోణం, గోదావరి, కృష్ణా పుష్కరాలు, నీటి ప్రాజెక్ట్‌లు, గృహ నిర్మాణంలో అవినీతిపై విచారణ జరుపుతామని మంత్రి చెప్పారు.

విశాఖ టీడీపీ కార్యాలయానికి నోటీసులు..! కొనసాగుతున్న పరంపర..!!
విశాఖ టీడీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీలు జారీ చేశారు. ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు వారం రోజులుగా ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై టీడీపీ నగర అధ్యక్షుడు రెహమాన్ స్పందిస్తూ.. పార్టీ కార్యాలయం ఉన్న స్థలాన్ని 2001 లో ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నామని, అప్పటి నుంచి ప్రతీ ఏడాది లీజ్‌ను ప్రభుత్వానికి కడుతూనే ఉన్నామని స్పష్టం చేశారు. జీవీఎంసీ అధికారులు మమ్మల్ని లింక్ డాక్యుమెంట్స్ అడిగితే ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. మాకు తెలిసి అది ప్రభుత్వ స్థలమేనని, దీనిపైన త్వరలోనే జీవీఎంసీ కమిషనర్‌ను కలుస్తామని రెహమాన్ తెలిపారు.












Click it and Unblock the Notifications