కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'రామసుబ్బారెడ్డిని మోసం చేశారు', 'ఆదిపై 2019లో వైసీపీ అభ్యర్థి ఇతనే'!

కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ టిక్కెట్టును డాక్టర్ సుధీర్ రెడ్డిని బరిలోకి దింపనుంది ఆ పార్టీ.గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరారు. దీంతో 20

|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ టిక్కెట్టును డాక్టర్ సుధీర్ రెడ్డిని బరిలోకి దింపనుంది ఆ పార్టీ.గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరారు. దీంతో 2019 ఎన్నికల కోసం వైసీపీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డిని బరిలోకి దింపనుంది.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ నుండి ఆదినారాయణరెడ్డి, టిడిపి నుండి రామసుబ్బారెడ్డి పోటీచేశారు.అయితే ఈ ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఓటమిపాలయ్యాడు.

అయితే ఏడాదిన్నర క్రితం ఆదినారాయణరెడ్డి వైసీపీని వీడి టిడిపిలో చేరారు. అంతేకాదు ఆయనను చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. అయితే ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు రామసుబ్బారెడ్డి.ఒకానొక దశలో ఆయన పార్టీ వీడతారనే ప్రచారం కూడ సాగింది. కానీ, ఆయన టిడిపిలోనే కొనసాగుతానని ప్రకటించారు.

 ఆదిపై పోటీకి డాక్టర్ సుధీర్ రెడ్డి

ఆదిపై పోటీకి డాక్టర్ సుధీర్ రెడ్డి


జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది.ఈ మేరకు ఆ పార్టీకి చెందిన నాయకులు వైసీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమావేశాన్ని ఏర్పాటుచేశారు.ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం నుండి డాక్టర్ సుధీర్ రెడ్డిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు చెప్పారు.ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ డాక్టర్ సుధీర్ రెడ్డి హమీ ఇచ్చారని కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ప్రకటించారు.

వ్యక్తిగత అభిృద్దికే ఆదినారాయణరెడ్డి ప్రాధాన్యత

వ్యక్తిగత అభిృద్దికే ఆదినారాయణరెడ్డి ప్రాధాన్యత

వ్యక్తిగత అభివృద్దికే ఆదినారాయణరెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేశారు.ఇసుకను అమ్ముకొన్న ఘనత ఆదినారాయణరెడ్డిదేనన్నారు.అతని దొంగాటలు సాగకపోవడంతో ఎస్పీ రామకృష్ణపై ఆరోపణలు చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. బ్రహ్మిణిలో మంత్రి ఆదినారాయణరెడ్డి ఇనుమును అమ్ముకొన్నారని ఆరోపించారు.2012 లో వేరుశనగ ఇన్సూరెన్స్ కు సంబంధించి రైతులకు ఏం ప్రయోజనం చేకూర్చారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన లేఖను రాష్ట్రం ఎందుకు పంపలేదని ఆయన ప్రశ్నించారు.

రామసుబ్బారెడ్డిని మోసం చేశారు

రామసుబ్బారెడ్డిని మోసం చేశారు

టిడిపి ఆవిర్భావం నుండి ఆ పార్టీలోనే ఉన్న రామసుబ్బారెడ్డిని ఆయన వర్గం నాయకులను చంద్రబాబు కుటుంబం మోసం చేసిందని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు అమర్ నాథ్ రెడ్డి విమర్శించారు. మహనాడులో ప్రజలకు ఉపయోగపడే తీర్మాణాలు ఏం చేయలేదన్నారు.ఆదినారాయణరెడ్డికి అభివృద్ది అంటే తెలియదని ఆయన విమర్శించారు.

2019 లో ఆదినారాయణరెడ్డి ఓటమి తప్పదు

2019 లో ఆదినారాయణరెడ్డి ఓటమి తప్పదు

2019 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డికి ఓటమితప్పదని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి జోస్యం చెప్పారు.వైసీపీని ఆదినారాయణరెడ్డి వెన్నుపోటు పొడిచారని చెప్పారు.జమ్మలమడుగు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందన్నారు జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జీ డాక్టర్ సుధీర్ రెడ్డి. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.

English summary
Doctor Sudheer Reddy will contest as a Ysrcp candidate in Jammalamadugu assembly segment.Ysrcp Jammalamadugu meeting held in Jammalamadu.Kadapa Mp Avninash reddy slams on minister Adinarayana Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X