అమ్మా నువ్వంటే ఇష్టం, కానీ: ప్రత్యేక హోదా కోసం యువకుడి ఆత్మహత్య
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఓ యువకుడు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేటు వద్ద ఉన్న సెల్ టవర్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్య చేసుకున్న యువకుడిని త్రినాథ్‌గా గుర్తించారు. అతనితి రాజమహేంద్రవరం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.

ప్రత్యేక హోదా సాధనకు అందరూ ఏకమై పోరాడాలని ఆ లేఖలో కోరాడు. అమ్మా నన్ను క్షమించాలని, నీ మాట తప్పుతున్నానని, ప్రపంచంలో నువ్వంటే నాకు ఎంతో ఇష్టమని, అన్నయ్యా.. అక్క, అమ్మ జాగ్రత్త ్ని, బావగారూ ఇకపై ఇంటికి మీరే దిక్కు, సెలవు అని పేర్కొన్నారు.
ఆనాడు హైదరాబాద్ అభివృద్ధి విషయంలో చూసిన శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై చూపించాలని కూడా తన సూసైడ్ నోట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరాడు.












Click it and Unblock the Notifications