Video:అమ్మ నీకోసం నేనిక్కడే ఉన్నా.. కదిలించే కన్నీటి ప్రేమ కథ..
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిన ప్రస్తుత తరుణంలో అటువంటివాటికి తాము దూరమని, ప్రేమ, విశ్వాసానికే తమ మొదటి ప్రాధాన్యమని ఓ శునకం మరోసారి నిరూపించింది. తన కళ్లముందే వంతెన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న యజమాని తిరిగివస్తుందనే ఆశతో అక్కడే గంటల తరబడి ఎదురు చూసింది. ఎంతకీ రాకపోవడంతో ఆ యజమాని అక్కడ వదిలిన చెప్పుల దగ్గరే ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంది. వంతెనవైపు చూస్తూ చెప్పుల దగ్గర అరుస్తూ ఉన్న శునకాన్ని చూసిన స్థానికులు అప్రమత్తమయ్యారు.
యానాం ఫెర్రీ రోడ్ లో నివాసముంటున్న మందాగి కాంచన యానాం-ఎదుర్లంక బాలయోగి వారధిపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంటిదగ్గర నుంచి తనతోపాటు వచ్చిన శునకాన్ని అక్కడే వదిలేసింది. గోదావరిలోకి దూకిన తర్వాత తన యజమాని కనిపించకపోవడంతో ఆ శునకం ఎదురుచూపులు చూస్తూ అక్కడే ఉండిపోయింది. ఆ యువతి విడిచిన చెప్పుల దగ్గరే అరుస్తుండటంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పోలీసులతో కలిసి గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. ఆ యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చి ఆ శునకాన్ని తీసుకువెళ్లేవరకు అది అక్కడే ఉండిపోయింది.

యానాం:గోదావరిలోకి దూకి యువతి ఆత్మహత్య..యువతి కోసం ఎదురు చూస్తున్న పెంపుడు కుక్క#GodavariRiver #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/09X162M8u8
— oneindiatelugu (@oneindiatelugu) July 18, 2023
యజమానిపట్ల ఆ కుక్క చూపించిన విశ్వాసం మనుషుల్లోని మానవత్వానికి సవాల్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కూడా ఈ తరహా సంఘటనలు రెండు చోటుచేసుకున్నాయి. డబ్బుల కోసం, ఆస్తి కోసం కుటుంబ సభ్యులే ఒకరినొకరు హత్య చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో ప్రేమ, విశ్వాసమే శ్వాసగా చూపిస్తూ తన యజమాని కోసం ఎదురు చూసిన ఆ శునకం మానవాళికి పాఠం నేర్పుతోంది.












Click it and Unblock the Notifications