ప్రేయసి మృతి, చావుబతుకుల మధ్య ప్రియుడు

ప్రియురాలు యద్దనపూడి అశ్విని బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థిని కాగా, ప్రియుడు బి. కిశోర్ ట్రాక్టర్ డ్రైవర్. కిశోర్‌కు అదివరకే పెళ్లయింది. భార్యను వదిలేశాడు. దీంతో పెళ్లికి అశ్విని తల్లిదండ్రులు అంగీకరించలేదు.
తమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించరనే ఉద్దేశంతో అశ్విని ప్రియుడితో రెండు రోజుల క్రితం పిట్టలవానిపాలెం కోడూరు నుంచి పారిపోయింది. అయితే, ఇద్దరు కూడా ఆదివారంనాడు ఇంటికి తిరిగి వచ్చారు. కొద్దిసేపటికే అశ్విని స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చి చెప్పారు.
అదే సమయంలో కిశోర్‌ను కూడా అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇంటికి రావడానికి ముందు వారు పురుగుల మందు తాగినట్లు వైద్యులు తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications