జైట్లీతో సుజన 'ఆర్థిక' మంతనాలు, బాబు అంటే మోడీకి భయం: జేసీ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కేంద్రమంత్రి, టిడిపి ఎంపీ సుజనా చౌదరి, మరో టిడిపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి ఆర్థిక సాయం పైన వారు చర్చించారని తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ కోసం కేంద్రమంత్రి సుజనా చౌదరి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాని కార్యాలయ సిబ్బందిని స్వయంగా ఆయననే సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ప్రధానితో సమావేశం కోసం సుజన సమయం కోరారు.

Also Read: నిద్రపోయారా: హోదాలోకి చిరంజీవిని లాగిన బీజేపీ మంత్రి

Sujana Choudhary meets Arun Jaitley

అప్పుడే చంద్రబాబుకు చెప్పా: జేసీ

బీజేపీతో పొత్తు విషయమై ఏడాది క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పానని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం కూడా ఆయన ఈ విషయం చెప్పారు. బీజేపీతో పొత్తు వద్దని తాను ఎప్పుడో చెప్పానని అన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు పైన కూడా జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. బంద్ వల్ల ఎలాంటి లాభం ఉండదని చెప్పారు. అవసరమైతే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపవచ్చునని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP MP Sujana Choudhary has met Union Minister Arun Jaitley on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి