ఏపీలో ఉత్కంఠ, ఢిల్లీలో చర్చలు: చూద్దాం.. లెక్కలు వేయమని బాబు

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాను తలపించేలా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం బుధవారం ప్రకటిస్తుందనే వార్తల నేపథ్యంలో ఏపీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కేంద్రం ఏం ఇస్తుంది? హోదాను మించి ఏం ప్రకటిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఓ వైపు ఏపీలో ఉత్కంఠ, మరోవైపు ఢిల్లీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

రాజ్‌నాథ్‌తో సుజన భేటీ

రాజ్‌నాథ్‌తో సుజన భేటీ

ఢిల్లీలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఆయన నివాసంలో టిడిపి నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ప్రత్యేక ప్యాకేజీ పైన తుది కసరత్తు పైన చర్చించరని తెలుస్తోంది.సుజనా చౌదరితో రాజ్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అమరావతి నిర్మాణ బాధ్యత తమదేనని చెప్పారు. ఆ నిధులను డీపీఆర్‌లు ఇచ్చాక ఇస్తామని చెప్పారని తెలుస్తోందిత.

చంద్రబాబుకు సమాచారం

చంద్రబాబుకు సమాచారం

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయమై ఢిల్లీ పెద్దలు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బుధవారం నాడు మరోసారి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

చంద్రబాబు సమీక్ష

చంద్రబాబు సమీక్ష

చంద్రబాబు మంగళవారం రాత్రి పదకొండు గంటల వరకు విజయవాడలోని తన క్యాంప్‌ ఆఫీసులో కూర్చుని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన పైన సమీక్షించారు. మంత్రులు యనమల, పత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చించారు. మధ్యలో ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా వీరితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలిపారు.

చంద్రబాబు లెక్కలు

చంద్రబాబు లెక్కలు

మనకు ప్రత్యేక హోదా ఇస్తే పథకాల వారీగా ఏ మేరకు నిధులు వస్తాయో లెక్కలు తీయాలని, ఇప్పుడు ప్యాకేజీ కింద ఏమిస్తామంటున్నారో చూడాలని, దానినీ, దీనినీ బేరీజు వేస్తూ ప్రత్యామ్నాయ నివేదిక సిద్ధం చేసి కేంద్రానికీ ఇద్దామని దీనివల్ల మనకూ, వారికీకూడా స్పష్టత వస్తుందని చంద్రబాబు.. అధికారులకు ఆర్థికమంత్రి యనమలకు సూచించినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+