ఏపీకి ఏమిచ్చారో అన్నీ లెక్కలు తీద్దామా: బీజేపీకి సుజన, అల్టిమేటం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా విషయమై టిడిపి - బిజెపి మధ్య మాటల యుద్ధం మరోసారి కనిపించే అవకాశముంది. బుధవారం టిడిపి పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సందర్భంగా కేవీపీ రామచంద్ర రావు ప్రయివేటు మెంబర్ బిల్లు పైన ఏం చేయాలనే అంశంపై చర్చించింది.

అనంతరం కేంద్రమంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి విలేకరులతో మాట్లాడారు. ఆయన ఓ విధంగా కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన విషయాల పైన తాము బ్యాలెన్స్ షీట్ బయటపెడతామని ఆయన ఓ విధంగా సవాల్ చేశారు.

Sujana Choudhary questions BJP over Special Status to AP

దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ, హోంశాఖ స్పష్టం చేయాలన్నారు. కేవీపీ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము పని చేస్తామని చెప్పారు. ఏపీకి కేంద్రం ఇప్పటిదాకా ఏం చేసింది, ఇంకా ఏం చేయాలనే విషయమై సభలో చర్చించేందుకు సిద్ధమన్నారు.

అవకాశం ఇస్తే రాజ్యసభలో అన్ని అంశాలను చర్చిస్తామని చెప్పారు. మిత్రధర్మం పాటిస్తుందో లేదో బీజేపీయే చెప్పాలన్నారు. రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలన్నారు. ఈ రెండేళ్లలో కొన్ని విషయాల్లో తాము అసంతృప్తితో ఉన్నామని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sujana Choudhary questions BJP over Special Status to AP.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి