వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ పారిపోతున్నారని నేను అనను!: మోడీ ప్రభుత్వంపై టీడీపీ అలా, సుజన ఇలా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై గత ఐదు రోజులుగా అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇస్తున్నప్పటికీ చర్చ జరగడం లేదని, స్పీకర్ తీరు చాలా బాధాకరమని మాజీ కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి గురువారం అన్నారు.

Recommended Video

పవన్ కళ్యాణ్ ఆదేశించాడు , కేంద్రం పాటిస్తోంది !

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

తాము పదేపదే అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. అవిశ్వాసంపై చర్చ జరగాల్సిందే అన్నారు. అవిశ్వాసం విషయంలో ప్రభుత్వం పారిపోతుందని తాను కేంద్రాన్ని విమర్శించనని చెప్పారు. దానికి కారణం కూడా చెప్పారు.

ప్రభుత్వం పారిపోతుందని ఎందుకనడం లేదంటే

ప్రభుత్వం పారిపోతుందని ఎందుకనడం లేదంటే

ఎందుకంటే అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోయేది ఏమీ లేదని, కాబట్టి పారిపోతుందనేందుకు అర్థం లేదన్నారు.
అవిశ్వాస తీర్మానంపై అఖిల పక్ష సమావేశం జరగాలని సుజనా చౌదరి అన్నారు. తాము యూటర్న్ తీసుకున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించడంపై ఆయన మాట్లాడుతూ.. మేం ఏ టర్న్ తీసుకోవాలో మాకు తెలుసునని, ఏమైనా ఉంటే వారిని అడగాలని చెప్పారు.

ఎన్ని మార్గాల్లో ప్రయత్నించాలో అన్ని మార్గాల్లో

ఎన్ని మార్గాల్లో ప్రయత్నించాలో అన్ని మార్గాల్లో

అవిశ్వాసంపై తమ విజ్ఞప్తికి స్పీకర్ సానుకూలంగా స్పందించలేదని సుజనా చౌదరి అన్నారు. ఎన్ని మార్గాల్లో ప్రయత్నించాలో అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. కొన్ని పార్టీల సహకారంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సభ ఆర్డర్‌లో లేదని పదేపదే వాయిదా

సభ ఆర్డర్‌లో లేదని పదేపదే వాయిదా

సమస్య పరిష్కరిద్దామనే ఆలోచన ఉంటే చేయవచ్చునని సుజన చెప్పారు. సభ ఆర్డర్‌లో లేదని పదేపదే వాయిదా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ అఖిలపక్ష సమావేశం పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

చర్చ జరపాలనకుంటే

చర్చ జరపాలనకుంటే

అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరపాలనుకుంటే వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్, అన్నాడీఎంకే ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేయవచ్చునని చెప్పారు. స్పీకర్ విచక్షణాధికారాలను ఎవరూ ప్రశ్నించరని చెప్పారు. కాగా, అవిశ్వాసంపై చర్చకు కేంద్రం పారిపోతుందని చంద్రబాబు, ఇతర టిడిపి నేతలు చెప్పగా, సుజన మాత్రం తాను అలా చెప్పలేనని అనడం గమనార్హం.

English summary
Former Union Minister Sujana Chowdary demanded for debate on No Confidence Motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X