వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా, దక్షిణాది వారికి డిప్యూటీ: సుమన్ కొత్త డిమాండ్
వచ్చే ఎన్నికల్లో తాను రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రముఖ నటుడు సుమన్ తెలిపారు. ఆయన శనివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఒంగోలు: వచ్చే ఎన్నికల్లో తాను రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రముఖ నటుడు సుమన్ తెలిపారు. ఆయన శనివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది మాత్రం ఇప్పుడే చెప్పలేనని సుమన్ అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిబద్ధతగా కృషి చేస్తుందని భావించిన ఏ పార్టీలోనైనా చేరుతానన్నారు.

లేదంటే కనీసం వారికి మద్దతివ్వడమో చేస్తానని చెప్పారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి మరీ దీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి క్షేమాన్ని చూడాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందన్నారు.
దక్షిణ భారతీయులు తమ కష్టనష్టాలు చెప్పుకోవడానికి ఉప ప్రధాని పదవిని దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించాలని ఈ సందర్భంగా సుమన్ కొత్త డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications