బీటెక్ విద్యార్థి సుమన్: దొంగిలించిన కార్లలో గర్ల్‌ఫ్రెండ్స్‌తో మాజీ ఎమ్మెల్యే కొడుకు రైడ్
హైదరాబాద్: బీఎండబ్ల్యూ కారును దొంగిలించిన వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అయితే, దీనిని పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నిందితుడి పేరు సుమన్, బీటెక్ విద్యార్థిగా తెలుస్తోంది. జల్సాలకు అలవాటుపడ్డ అతను తన లగ్జరీ లైఫ్ కోసం, గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఈ దొంగతనాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అతను తాను దొంగిలించిన వాహనాల్లో గర్ల్ ఫ్రెండ్స్‌ను రైడ్‌కు తీసుకు వెళ్తాడట.
పబ్బులు, ఇతర ప్రాంతాల్లో పార్క్ అయిన కార్లను అతను టార్గెట్ చేస్తాడు. సెక్యూరిటీ పర్సనల్‌ను డైవర్ట్ చేసి కీస్ దొంగిలించి, కార్లను దొంగిలిస్తాడని తెలుస్తోంది. అతని నుండి పోలీసులు మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ బీఎండబ్ల్యూ కారు ఉంది. అతను మాజీ ఎమ్మెల్యే కొడుకు అని తెలుస్తోంది. దొంగిలించిన కారును అమ్మి ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు. ఇతని పైన బేగంపేట, జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
అదుపు తప్పిన ఓ స్కార్పియో వాహనం రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నార్సింగ్‌కి చెందిన రాజిరెడ్డి హోండా బైక్ మీద మహారాజ స్ట్రీట్‌కు వెళుతున్నాడు. ఓ చేతక్ పై అదే ప్రాంతానికి చెందిన కిరణ్, సాయి వారి తల్లితో కలిసి మహారాజ స్ర్టీట్‌కు వెళుతున్నారు.
ఈ వాహనాలు జోన్నాడ వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన స్కార్పియో ఢీ కొట్టి వెళ్లిపోయింది. బైక్‌మీద ఉన్న రాజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కిరణ్, సాయి వారి తల్లి తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా సాయి మృతి చెందాడు. కిరణ్ అతడి తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications