వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుజనా చౌదరికి కోర్టు షాక్: అప్పు తీసుకొని చెల్లించలేదని సమన్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరికి నాంపల్లి కోర్టు శనివారం నాడు షాకిచ్చింది. మారిషస్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను సుజనాకు చెందిన కంపెనీ చెల్లించని విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంలో ఇచ్చిన రుణాన్ని వసూలు చేసుకునేందుకు మారిషస్ బ్యాంకు కోర్టుకు ఎక్కింది. ఈ వ్యవహారంలో మారిషస్ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం విచారించిన హైకోర్టు సుజనాకు నోటీసులు జారీ చేసింది.

Summons issued to Sujana choudhary

మార్చి అయిదో తేదిన జరగనున్న విచారణకు హాజరుకావాలని సుజనాకు కోర్టు సమన్లు జారీ చేసింది. సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అనుబంధ కంపెనీ అయిన హేస్టింగ్స్‌ హోల్డింగ్స్‌ పేరుతో మోసపూరితంగా తమ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారని, దాన్ని తిరిగి చెల్లించలేదని మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న 12వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ డేనియల్‌ రూథ్‌ నిందితులకు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, దాని ఎండీ జి శ్రీనివాసరాజు, డైరెక్టర్‌ ఎస్ హనుమంతరావు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుజనా చౌదరి, దాని అనుబంధ కంపెనీ హేస్టింగ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌లకు సమన్లు జారీ అయ్యాయి.

English summary
A metropolitan court at Nampally has issued summons to Union Minister of State for Science and Technology Sujana choudhary and directors of the company owned by him, Sujana Universal Industries, on a complaint by Mauritius-based Mauritius Commercial Bank for “non-repayment of a loan”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X