ఇందూటెక్‌లో జగన్, సబితలకు సమన్లు: సాయి పిటిషన్

ఈ కేసులో నిందితులు వైయస్ జగన్, విజయ సాయి రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, రత్నప్రభ, బిపి ఆచార్య, పార్థసారథి, కోటేశ్వర రావు, శ్యాంప్రసాద్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులకు కోర్టు సమన్లు జారీ చేసింది.
శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన ఇందూ ప్రాజెక్టు లిమిటెడ్, ఇందూ టెక్ జోన్ ప్రయివేట్ లిమిటెడ్, ఎస్పీఆర్ ప్రాపర్టీస్ ప్రయివేట్ లిమిటెడ్, భూమి రియల్ ఎస్టేట్స్‌లకు, నిమ్మగడ్డకు చెందిన జి2, జగన్‌కు చెందిన కార్మెల్ ఏషియాలకు కూడా సమన్లు జారీ అయ్యాయి. నవంబర్ 13న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
బెయిల్ షరతులు సడలించాలని సాయి రెడ్డి
బెయిల్ షరతులను సడలించాలని జగన్ ఆసతుల కేసులో నిందితుడు విజయ సాయి రెడ్డి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్‌నని, విధి నిర్వహణలో భాగంగా ఇతర నగరాలకు వెళ్లడానికి వీలుగా షరతులను సడలించాలని కోరారు.












Click it and Unblock the Notifications