అరసవెళ్లి సూర్యనారాయణ భక్తుల ఆశలపై నీళ్లు
శ్రీకాకుళం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అరసవెళ్లి శ్రీ సూర్యనారాయణ భక్తుల ఆశలపై నీళ్లు చల్లింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఆకాశం మేఘామృతం కావడంతో సూర్య కిరణాలు స్వామి మారి పదాలను తాకలేదు.
దీంతో ఉత్తరాయ, దక్షిణాయన కాలంలో సూర్యుడి కిరణాలు స్వామి వారి మూల విరాట్ విగ్రహాన్ని తాకడానికి మబ్బులు అడ్డంకిగా మారాయి. దీంతో సూర్యకిరణాలు స్వామి వారి మూల విరాట్‌ను తాకే అద్భుత దృశ్యాన్ని చూసే అవకాశాన్ని ఈ ఏడాది రెండోసారి కూడా భక్తులు కోల్పోయారు.
ఏడాదికి రెండు సార్లు మాత్రమే వచ్చే ఈ అద్భుతమైన అవకాశానికి వాతావరణ మార్పాలు అడ్డంకిగా మారడంతో భక్తులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఉత్తరాయణం, దక్షిరాణయం కాలల్లోని మార్పులతో భాగంగా ప్రతి ఏడాది మార్చి 9, 10, అక్టోబర్ 1,2 తేదీల్లో సూర్యుని కిరణాలు ఆలయ గర్భగుడిలోని మూల విరాట్‌ను తాకుతాయి.












Click it and Unblock the Notifications