వివేకా కేసులో సునీత అనూహ్య ప్రతిపాదన..!!
వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి ఈ రోజు. తన తండ్రికి కుమార్తె సునీత నివాళులర్పించారు.
తన తండ్రి హత్య గురించి ప్రస్తావిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. న్యాయం కోసం ఆరు సంవత్స రాలుగా పోరాడుతున్నట్లు తెలిపారు. హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ బయట యధేచ్చగా తిరుగుతున్నారని వాపోయారు. ఈ కేసులో తమ కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్న ట్లు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇదే సమయంలో సునీత అనూహ్య ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు.
వివేకా వర్థంతి వేళ
వైఎస్ వివేకా వర్దంత వేళ పులివెందుల లోని సమాధుల తోటలో తండ్రి సమాధికి పూలమాల వేసి సునీత, కుటుంబ సభ్యులు నిబవాళులర్పించారు. తన తండ్రి హత్య.. కేసు విచారణ గురించి సునీత కీలక వ్యాఖ్యలు చేసారు. తన తండ్రి మరణించి ఆరేళ్లు అవుతుందని చెప్పారు. న్యాయం కోసం ఆరు సంవత్స రాలుగా పోరాడుతున్నట్లు తెలిపారు. హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ బయట యధేచ్చగా తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. విచారణ జరగట్లేదు ట్రైల్స్ నడవట్లేదు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. హత్య గురించి ఎంత పోరాడినా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సీబీఐ విచారణలో
తన తండ్రి విచారణ విషయంలో నిందితుల కంటే తమకు , తమ కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్లు అనిపిస్తోందన్నారు. సీబీఐ వారు మళ్ళీ విచారణ ప్రారంభించాలని సునీత కీలక ప్రతిపాదన చేసారు. సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలని కోరారు. సాక్షులపై ఒత్తిడి తీసుకొని వస్తున్నారన్నారు. సాక్షుల మరణాలపై కూడా తమకు అనుమానం ఉందన్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానని సునీత రెడ్డి స్పష్టం చేశారు. 2019 ఎన్నికల సమయంలో మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వివేకా దారుణ హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుగా చెప్పగా.. ఆ తరువాత హత్యగా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాతి పరిణామాలతో ఈ హత్య రాజకీయంగా సంచలనంగా మారింది.
సునీత డిమాండ్ తో
ఈ కేసు సీబీఐ విచారణ చేస్తోంది. అనేక అంశాలు విచారణ సమయంలో వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సైతం సీబీఐ విచారణ చేసింది. అవినాశ్ పైన సునీత పలు పిటీషన్లు దాఖలు చేసారు. వైఎస్ భాస్కర్‌రెడ్డితోపాటు వైసీపీ కీలక నేత దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి.. మొత్తం ఎనిమిది మందిపై సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది. అయితే దస్తగిరి మాత్రం అప్రూవర్‌గా మారిపోయారు. ఈ కేసులో సంబంధం ఉన్న పలువురు మరణించడం కూడా అను మానాలకు దారి తీసింది. సునీత మాత్రం హైకోర్టు, సుప్రీం కోర్టుల చుట్టూ తిరుగుతూ తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు సునీత ఈ కేసు సీబీఐ మళ్లీ విచారణ చేయాలనే డిమాండ్ కీలకంగా మారుతోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications