కడప సీటు అతనికి ఇవ్వండి.. కూటమి కీలక నేతకు సునీత సిఫారసు..!?

ఏపీలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికల వేళ కూటమి - వైసీపీ మధ్య రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ఈ ఎన్నికలు రెండు వైపులా ప్రతిష్ఠాత్మకం గా మారుతోంది. ఈ సమయంలోనే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. కాగా.. కడప కేంద్రంగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. వివేకా కుమార్తె జోక్యం పైన రాజకీయంగా కొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది.

స్థానిక సంస్థల వేళ కొత్త చర్చ మొదలైంది. మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడప పైన కూటమి నేత లు ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల్లో వైసీపీకి అవకాశం లేకుండా కూటమి ఏకపక్షంగా విజయం సాధించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే మూడు పార్టీల నేతలు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండ టంతో... కూటమి పార్టీలు సీట్ల షేరింగ్ పైన కసరత్తు చేస్తున్నారు. కాగా.. వివేకా కుమార్తె సునీత తాజాగా కూటమిలో ముఖ్య నేతతో భేటీ అయ్యారు. భర్త రాజశేఖర్ రెడ్డితో కలిసి సమావేశమైన సునీత కీలక అంశాల పైన చర్చ చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే స్థానిక ఎన్నికల పైన కడపలో సీటు అంశం పైనా ప్రతిపాదనలు చేసారని సమాచారం.

కొత్త పాత్రలో విజయమ్మ, వైసీపీ ముఖ్యులతో మంత్రాగం - కీలక మలుపు..!?
కొత్త పాత్రలో విజయమ్మ, వైసీపీ ముఖ్యులతో మంత్రాగం - కీలక మలుపు..!?
sunitha-meets-alliance-leader-buzz-over-kadapa-zp-chairperson-seat-here-the-report

కడప రాజకీయాల్లో కొత్త చర్చ

కూటమి ముఖ్య నేతతో భేటీ వేళ కడప రాజకీయాల ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. కాగా, జిల్లా జెడ్పీ ఛైర్మన్ సీటును తన భర్త రాజశేఖర్ రెడ్డి సోదరుడు శివప్రకాశ్ రెడ్డి కుమారుడు ప్రదీప్ రెడ్డికి ఇవ్వాలని సునీత సిఫారసు చేసినట్లు గా జిల్లాలో ప్రచారం సాగుతోంది. దీంతో.. ఈ వ్యవహారం పైన జిల్లాలోని కూటమి పార్టీల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ సీటు కోసం మూడు పార్టీల్లోని నేతలు ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ నుంచి పలువురు కీలక నేతలు రేసులో ఉన్నారు. సునీత కోరినా.. ఈ సీటు దక్కే బయట వారికి దక్కే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే.. సునీత తాజాగా జిల్లా రాజకీయాల పైన జోక్యం చేసుకోవటంతో .. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో.. రాజకీయంగా రానున్న రోజుల్లో సునీత తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+