వంశీ! దమ్ముందా, నాపై గెలువు: వల్లభనేనికి పద్మశ్రీ సవాల్, బెదిరిస్తున్నారని..

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నుంచి తనకు ప్రాణహానీ ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మ సోమవారం విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, ఏపీ డిజిపి సాంబశివ రావుకు ఆమె లేఖ రాశారు. గన్నవరం నియోజకవర్గంలో వంశీ అవినీతి, అక్రమాలు ప్రశ్నించినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు.

Sunkara Padma Shri challenges Vallabhaneni Vamshi

వంశీ తన గుండాలు, అనుచరుల ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వంశీకి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ తనపై పోటీ చేసి గెలుపొందాలని పద్మశ్రీ సవాల్ విసిరారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని సుంకర పద్మశ్రీ విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress Party women chieff Sunkara Padma Shri on Monday challenged Telugudesam Party MLA Vallabhaneni Vamshi.
Please Wait while comments are loading...