రాజధాని కామెంట్స్ : జగన్ పై కోర్టు ధిక్కారానికి అటార్నీ జనరల్ నో ? సొలిసిటర్ జనరల్ కోర్టులోకి బంతి

మూడు రాజధానులపై సుప్రీంకోర్టు విచారణ సాగుతుండగానే.. ఏపీ రాజధానిని విశాఖ తరలిస్తున్నామంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమా కాదా అన్న విషయం తేల్చేందుకు ఏజీ నిరాకరించారు.

ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన సీఎం జగన్.. దాన్ని అమల్లోకి తెచ్చేవిషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో విశాఖలో త్వరలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు వచ్చే వారికి రాజధానిని విశాఖకు మార్చేస్తున్నామంటూ సీఎం జగన్ చెప్పడం వివాదాస్పదమైంది. దీన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టుకు పలు ఫిర్యాదులు అందాయి. అయితే వీటిపై నిర్ణయం తీసుకునే విషయంలో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి.

విశాఖ తరలింపుపై జగన్ కామెంట్స్

విశాఖ తరలింపుపై జగన్ కామెంట్స్

విశాఖ త్వరలో ఏపీ రాజధాని కాబోతోందని, త్వరలో తాను కూడా అక్కడికి మారుతున్నానంటూ సీఎం జగన్ తాజాగా ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టెన్ రైజర్ ఈవెంట్ లో పెట్టుబడిదారులు, దౌత్తవేత్తలకు స్పష్టం చేశారు. దీంతో విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు వారు తరలివస్తారని భావించారు. కానీ జగన్ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటిగా మారింది.

జగన్ అనుకున్న విధంగా వీరు పెట్టుబడులతో విశాఖ వస్తారో రారో తెలియదు కానీ.. ఆయన చేసిన కామెంట్స్ మాత్రం సుప్రీంకోర్టులో జరుగుతున్న మూడు రాజధానుల విచారణ నేపథ్యంలో కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై సుప్రీంకోర్టు దృష్టిసారిస్తోంది.

 జగన్ కామెంట్స్ పై జడ శ్రావణ్ ఫిర్యాదు

జగన్ కామెంట్స్ పై జడ శ్రావణ్ ఫిర్యాదు

సుప్రీంకోర్టులో మూడు రాజధానుల విచారణ సాగుతున్న సమయంలో వైఎస్ జగన్ విశాఖకు రాజధాని మారుతోందంటూ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయా రావా అన్న దానిపై జైభీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ అటార్నీ జనరల్ వెంకటరమణితో పాటు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కూ లేఖలు రాశారు.

సుప్రీం విచారణ నేపథ్యంలో జగన్ చేసిన కామెంట్స్ పై సుమోటోగా కోర్టు ధిక్కారం కింద విచారణ చేపట్టాలని ఆయన కోరారు. దీంతో ఈ వ్యవహారంపై ఇవాళ అటార్నీ జనరల్ స్పందించి జడ శ్రావణ్ కు సమాధానం ఇచ్చారు.

ధిక్కారం తేల్చలేనన్న అటార్నీ జనరల్

ధిక్కారం తేల్చలేనన్న అటార్నీ జనరల్

అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో జగన్ చేసిన కామెంట్స్ కోర్టు ధిక్కారం కిందకు వస్తాయా రావా అన్నది తేల్చేందుకు అటార్నీ జనరల్ నిరాకరించారు. దీని వెనుక ఓ బలమైన కారణం ఉంది. గతంలో ఏపీ ప్రభుత్వం తరఫున కేసులు వాదించానని, కాబట్టి ఇప్పుడు ఈ వ్యవహారంలో తన అభిప్రాయం చెప్పలేనంటూ అటార్నీ జనరల్ స్పష్టం చేశారు.

ఈ మేరకు జడ శ్రావణ్ కుమార్ రాసిన లేఖలో అటార్నీ జనరల్ తన నిస్సహాయత వ్యక్తం చేశారు. అయితే శ్రావణ్ విజ్ఞప్తిని సొలిసిటర్ జనరల్ కు పంపారు.

 సొలిసిటర్ జనరల్ కోర్టులోకి?

సొలిసిటర్ జనరల్ కోర్టులోకి?

సుప్రీం విచారణ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలపై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన అటార్నీ జనరల్ వెంకటరమణి ఈ ఫిర్యాదును సొలిసిటర్ జనరల్ కు పంపుతున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులోకి బంతి వెళ్లింది. ఆయన దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఒకవేళ సొలిసిటర్ జనరల్ కూడా కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకునేందుకు మొగ్గు చూపితే జగన్ చిక్కుల్లో పడటం ఖాయం. అలా కాదని ఇవి కేవలం రాజకీయ వ్యాఖ్యలో, సాధారణ వ్యాఖ్యలు గానో పరిగణిస్తే మాత్రం తిరస్కరించేందుకు వీలుంది. దీంతో సొలిసిటర్ జనరల్ నిర్ణయం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+