విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడ ఎయిర్ పోర్టులో...అడ్వాన్స్ డ్ టెక్నాలజీ:రన్‌వే మధ్యలో సూపర్ టవర్‌!

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

Recommended Video

విజయవాడ విమానాశ్రయంలో సూపర్ టవర్

విజయవాడ:నవ్యాంధ్ర రాజధాని విమానాశ్రయమైన విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు ఇప్పుడు మరో స్పెషల్ ఎట్రాక్షన్ సమకూరనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విమాన రాకపోకలకు అత్యంత కీలకంగా మారిన విజయవాడ ఎయిర్ పోర్ట్ అభివృద్దిపై ఎపి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

దీంతో మారిన అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత అవసరాలకు తగినట్లు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేలాగా ఇస్తాంబుల్‌ తరహాలో ఒక ఆధునిక టవర్‌ బిల్డింగ్‌ నిర్మించనున్నారు. అయితే ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఉపయోగించే ఈ సూపర్ టవర్ ను ఎయిర్ పోర్టులో ఓ పక్కన కాకుండా ప్రస్తుతం ఉన్న రన్‌వేకు...నూతనంగా నిర్మిస్తున్న మరో రన్‌వేకు మధ్య భాగంలో నిర్మించనున్నట్లు సమాచారం.

విజయవాడ...విమానాశ్రయంలో...సూపర్ టవర్

విజయవాడ...విమానాశ్రయంలో...సూపర్ టవర్

విమానాశ్రయం మధ్యలో వీకేఆర్‌ కాలేజీ వైపు ఏర్పాటు చేసే ఈ ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ సూపర్ టవర్ లో విమానాశ్రయానికి సంబంధించి ఆధునిక సాంకేతిక వ్యవస్థ అంతా పొందుపరుస్తారని తెలిసింది. ఇదే విధంగా ఇస్తాంబుల్‌ విమానాశ్రయంలో రన్‌వే మధ్యభాగంలో ఏర్పాటు చేసిన టవర్‌ బిల్డింగ్‌లో ఆర్కిటెక్చర్‌ నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. విజయవాడలోని సూపర్ టవర్ ఆ స్థాయిలో కాకపోయినా...అదే తరహా టవర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సూపర్ టవర్...ప్రత్యేకతలు

సూపర్ టవర్...ప్రత్యేకతలు

రూ.25 కోట్ల అంచనాతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ సూపర్ టవర్‌ బిల్డింగ్‌కు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) అధికారులు తాత్కాలిక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆరు అంతస్థులుండే ఈ టవర్‌ బిల్డింగ్‌ పొడవు 100 అడుగుల పొడవు ఉంటుందని తెలిసింది. ఈ బిల్డింగ్‌ పై భాగంలో టవర్‌ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో పాత టెర్మినల్‌ దగ్గర ఏటీసీ టవర్‌ బిల్డింగ్‌ ఉండగా దీనికి పశ్చిమ దిశన రన్‌వే ఉంటుంది.

నిపుణుల...సూచనలు

నిపుణుల...సూచనలు

అయితే ఆధునిక ప్రమాణాల దృష్ట్యా ఎయిర్‌ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుంటే రన్‌వే మధ్య భాగంలో ఏటీసీ టవర్‌ బిల్డింగ్‌ ఏర్పాటు శ్రేయస్కరంగా నిపుణులు భావిస్తున్నారు. రన్‌వే రెండు వైపులా ఈ టవర్ కనిపించటానికి వీలుగా ఒక పక్కన దీన్ని నిర్మించాలి. దీనిపై నుంచి చూస్తే విమానం ల్యాండింగ్‌, టేకాఫ్‌ ల వంటివి స్పష్టం గా కనిపించేలా తీర్చిదిద్దనున్నారు. ఈ క్రమంలో కొత్త టవర్‌ బిల్డింగ్‌ డిజైన్లకు ప్రక్రియ ప్రారంభం కాగా వీటిల్లో ఒక దానిని కేంద్రం ఆమోదించాల్సిఉంటుంది.

ఫైర్ ఫైటర్లు...కొనుగోలు

ఫైర్ ఫైటర్లు...కొనుగోలు

ఇదిలావుండగా విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఇటీవలే ఆస్ట్రియా దేశం నుంచి అత్యంత శక్తివంతమైన రెండు ఫైర్‌ ఫైటర్లను ఒక్కొక్కటీ రూ.5 కోట్లకు కొనుగోలు చేశారు. టేకాఫ్‌, ల్యాండింగ్‌లో రన్‌వేపై ప్రమాదం జరిగితే రెండు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి ఫైర్‌ఫైటర్లు చేరుకుంటాయి. ఆ సామర్థ్యం ఈ ఫైర్ ఫైటర్ల సొంతం.

English summary
Vijayawada: The key airport in Navyandhra, Vijayawada International Airport will ready to get another special attraction. The AP government has focused on the development of the Vijayawada airport, which has become the key to aviation to the state of Andhra Pradesh. One modern Super Tower Building will be constructed will be constructed in Vijayawada International Airport soon as per the existing needs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X