అమరావతి కేసు - సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి రిలీఫ్..!!

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ దొరికింది. అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల కేటాయింపు వ్యవహారం కొంత కాలంగా న్యాయపరమైన వివాదంగా మారింది. ఆర్ 5 జోన్ ఏర్పాటు పైన స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసారు. హైకోర్టులో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో, రెండు జిల్లాలకు చెందిన పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి రంగం సిద్దం అయింది. హైకోర్టు తీర్పు పైన రైతులు సుప్రీంని ఆశ్రయించారు. స్టే ఇవ్వాలని కోరగా న్యాయస్థానం తిరస్కరించింది.

 Amaravati case

ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేసులో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లటానికి మార్గం సుగమం అయింది. ఆర్ -5 జోన్ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు కూడా ప్రస్తుతం రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్ కు ఈ కేసును బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీజే వద్ద ఆదేశాలు తీసుకోవాలని ఈ కేసు విచారించిన జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ కేసులో సుప్రీంలో ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా. ప్రముఖ న్యాయవాదులు హరీష్ సాల్వే ముకుల్ రోహిత్గీ అమరావతి రైతుల తరఫున వాదించారు.

 Amaravati case

పేదలకు ఇంటి స్థలాలు: అమరావతిలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50 వేల మందికి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని పైన ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అక్కడ ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో, ఈ నెల 18న ముఖ్యమంత్రి జగన్ అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి ముహూర్తంగా నిర్ణయించారు. ఇదే సమయంలో హైకోర్టు తీర్పు పైన అమరావతి రైతులు సుప్రీంను ఆశ్రయించారు. ఆర్ -5 జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని సుప్రీంను రైతులు కోరారు.అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిందని రైతులు సుప్రీం కోర్టుకు తెలిపారు.

 Amaravati case

రాజధాని కేసుతో కలిపి : విచారణ సమయంలో ఆర్‌- 5 జోన్‌పై త‌దుప‌రి విచార‌ణ వ‌ర‌కూ స్టే ఇవ్వాల‌ని రైతుల తరపు న్యాయవాది హ‌రీశ్ సాల్వే సుప్రీంను కోరగా... ఏపీ ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాదులు అడ్డుప‌డ్డారు. అమ‌రావ‌తి పిటిష‌న్ పెండింగ్‌లో ఉన్నందునే హైకోర్టు ఆర్- 5 జోన్ పైన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చిన విష‌యాన్ని ఏపీ ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది నిరంజ‌న్‌రెడ్డి ఉన్నతన్యాస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీని పైన స్పందించిన న్యాయస్థానం హైకోర్టు తీర్పు పైన స్టే ఇచ్చేందుకు నిరాకరిచింది. అమ‌రావ‌తి కేసుతో పాటు ఆర్-5 జోన్ కేసును క‌లిపి వినాల‌ని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+