మోహన్‌బాబు కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!

సినీ హీరో మోహన్‌బాబు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు చేసారు. మంచు కుటుంబంలో వివాదాల కవరేజ్ కు వెళ్లిన ఒక టీవీ ఛానల్ ప్రతినిధి పైన మోహన్ బాబు దాడికి చేసిన ఘటన పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేయటంతో, దీని పైన మోహన్ బాబు కోర్టును ఆశ్రయించారు. దీని పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ముందస్తు బెయిల్
మోహన్‌బాబు కు సుప్రీం కోర్టు లో ఊరట దక్కింది. జర్నలిస్టుపై దాడి కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణ జస్టిస్ సుధాంశ్ దులియా ధర్మా సనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఇదే పిటీషన్ పైన విచారణ చేసిన ధర్మాసనం మోహన్‌బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు తెలంగాణ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా జర్నలిస్ట్‌పై జరిగిన దాడికి తాను బహిరంగంగా క్షమాపణ చెప్పానని కోర్టుకు నివేదించారు. తాను నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని మోహన్ బాబు ధర్మాసనా నికి నివేదించారు.

Supreme court Grants Anticipatory bail for Actor Mohan Babu in Journalist attack case

కవరేజ్ కోసం వెళ్తే
మంచు కుటుంబంలో వివాదం జరిగిన సమయంలో కవరేజ్ కోసం ఆయన నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఆ సమయంలో తన పైన దాడి చేసారంటూ జర్నలిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహడీ షరీఫ్‌ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముంద స్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కొట్టివేసింది. రాచకొండ పోలీసులు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసుకుసంబంధించి కోర్టులో వాదనల సందర్భంగా జర్నలిస్టు రంజిత్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ, మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని కోరారు.

వాదనల తరువాత
మోహన్‌ బాబు తనయుడు మంచు మనోజ్‌ విజ్ఞప్తి మేరకు ఆయన వెంట మీడియా మోహన్‌బాబు ఇంటికి వెళ్లినట్లు జర్నలిస్టు తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. విలేకరి దగ్గరున్న మైక్‌ను లాక్కొని తల మీద కొట్టారని కోర్టుకు నివేదించారు. తీవ్ర గాయాల పాలైన విలేకరిని ఆస్పత్రిలో చేర్చారని.. చికిత్స తరువాత బయటకు వచ్చారని చెప్పుకొచ్చారు. గతంలో వాదనలు తరువాత దర్మాసనం మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్‌ కేసు కావడంతో డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేసే అవకాశం లేదు. దీంతో ముందస్తు బెయిలు కోసం మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ రోజు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం వెలువరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+