ఆగస్టు 2 నుంచి ఈ 4 రాశులకు అఖండ విజయాలు
జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతువుల సంచారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాల మార్పులతో పాటు నక్షత్ర సంచారాల కారణంగా ఏర్పడే ప్రభావం ద్వాదశ రాశులపై తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 2వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల 08 నిమిషాలకు కేతువు మాఘ నక్షత్రంలోని రెండవ పాదంలోకి ప్రవేశించబోతున్నాడు. అక్టోబర్ 3వ తేదీ వరకు కేతువు ఇదే స్థానంలో కొనసాగుతాడు.
ఈ రెండు నెలల కాలం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారికి 'గోల్డెన్ పీరియడ్' కాబోతోంది. ఈ నక్షత్ర సంచార ప్రభావంతో ఊహించని ధన లాభాలు కలగడమే కాకుండా, దీర్ఘకాలిక సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ సమయం అఖండ విజయాలను సాధించిపెట్టనుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ కేతు నక్షత్ర సంచారం అఖండ విజయాలను తెచ్చిపెడుతుంది. ఆర్థికంగా స్థిరపడటానికి, ధన లాభం పొందడానికి అనేక కొత్త మార్గాలు సుగమం అవుతాయి. ఉద్యోగాలు మారాలని అనుకునే వారికి ఈ సమయంలో మంచి ఆఫర్లు లభిస్తాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ఉన్నత పదవులతో పాటు జీతాలు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఆగస్టు 2 నుంచి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు చాలా సులభంగా తొలగిపోతాయి. ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. తమ వ్యాపారాలను కొత్త ప్రాంతాలకు విస్తరించాలనుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ కేతు సంచారం ఒక సువర్ణ అవకాశంగా మారబోతోంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు, ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతాయి. జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలను ఈ సమయంలో ధైర్యంగా తీసుకోగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఊహించని భారీ లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు దూరం కావడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మేష రాశి
కేతువు నక్షత్ర పాద మార్పుల కారణంగా మేష రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు రాబోతున్నాయి. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ సఫలీకృతులవుతారు.ఉద్యోగస్తులు తమ కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. కార్యాలయాల్లో సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు లేదా పదవులు దక్కే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అద్భుతమైన వృద్ధి కనిపిస్తుంది. కుటుంబంలో ఉన్న పాత సమస్యలు, సందిగ్ధతలు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది.


Click it and Unblock the Notifications