ఆఫర్లు రిజెక్ట్ చేయడం వెనుక ఉన్నది ఆ ఒక్కటే.. ఓపెన్ అయిన కాజల్!
సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్న ప్రముఖ నటి కాజల్ అగర్వాల్.. ఇటీవల సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్, బోల్డ్ పాత్రల ఎంపికపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు సాధారణమైపోయిన ఈ రోజుల్లో తాను మాత్రం తన వ్యక్తిగత హద్దులను ఎప్పుడూ దాటలేదని కాజల్ పేర్కొంది. తనకు ఇబ్బందిగా అనిపించే బికినీ ధరించడం లేదా బోల్డ్ సీన్లలో నటించడం వంటి వాటికి కెరీర్ ప్రారంభం నుంచే దూరంగా ఉన్నానని కాజల్ వెల్లడించింది.
పెద్ద చిత్రాలను తిరస్కరించినా బాధపడలేదు..
యాక్టింగ్ అనేది వ్యక్తిగత సౌకర్యాన్ని బట్టి ఉంటుందని అభిప్రాయపడిన కాజల్ అగర్వాల్.. కేవలం బోల్డ్ లేదా సన్నిహిత సన్నివేశాల్లో నటించేందుకు అసౌకర్యంగా ఉండటం వల్లే తాను గతంలో ఎన్నో పెద్ద సినిమాలను తిరస్కరించినట్లు కాజల్ పేర్కొన్నారు. అయితే ఆ అవకాశాలను వదులుకున్నందుకు తాను ఎప్పుడూ బాధపడలేదని చెప్పారు. ఏది చేయాలి చేయకూడదనేది మన అంతరాత్మ నిర్ణయిస్తుందని.. ఆ హద్దులు నాకు తెలుసు వాటిని దాటి నటించడం తనకు నచ్చదని కాజల్ అగర్వాల్ తెలిపింది.

లింగ వివక్షపై కాజల్ కామెంట్స్
సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ విషయంలో నటీనటులపై జరిగే ట్రోలింగ్ పై కాజల్ అగర్వాల్ స్పందించింది. రానున్న టాక్సిక్ సినిమాలో యష్, కియారా అద్వానీల బోల్డ్ సీన్స్ వివాదాన్ని ఉదహరిస్తూ.. కేవలం మహిళా నటులనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని కాజల్ ప్రశ్నించింది. హీరోలు కూడా తమ ఎంపికల విషయంలో ఆలోచించుకోవాలని.. అయితే నటీమణులు తమ నిర్ణయాల పట్ల కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉంటారనే కారణంతోనే వారిని ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటారని కాజల్ అభిప్రాయపడింది.
కొడుకు కోసం సినిమాల ఎంపికలో మార్పు
వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్‌కు నీల్ కిచ్లు అనే కుమారుడు ఉన్నాడు. తల్లయిన అనంతరం సినిమాలో ఎంపికలో ఇంకా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కాజల్ వెల్లడించారు. నా కొడుకు పెద్దయ్యాక నా సినిమాలు చూసి గర్వపడాలి తప్ప.. మా అమ్మ ఆ సీన్ లేదా ఆ సినిమా ఎందుకు చేసిందనే ప్రశ్నించే పరిస్థితి రాకూడదని కాజల్ అభిప్రాయపడింది. కొడుకును దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు ప్రతీ పాత్రను ఎంచుకుంటున్నానని కాజల్ అగర్వాల్ స్పష్టం చేశారు.
🚨 No Kiara Advani harmed in Kajal Aggarwal's statement:
— TEJASH 🚩 (@LoyleRohitFan) July 17, 2026
I have never done bikini scenes in any movie. I even rejected many films because of some unwanted scenes. I have some personal boundaries. After becoming a mother, I want to ensure that my child feels comfortable while… pic.twitter.com/cXRq0RUL0B
కాజల్ అగర్వాల్ రాబోయే చిత్రాలు
ఇక సినిమాల విషయానికొస్తే కాజల్ అగర్వాల్ త్వరలో 'ది ఇండియా స్టోరీ' చిత్రంలో కనిపించనున్నారు, ఇందులో శ్రేయాస్ తల్పడే కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న 'రామాయణ్'లో కాజల్ మండోదరి పాత్రలో కూడా కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications