సుప్రీంలో చంద్రబాబు కేసు విచారణలో తాజా అప్డేట్..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసుల విషయంలో కోర్టు నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్లను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఇటు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ పైన విచారణ ప్రారంభమైంది. తొలి సారి విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించిన 17 ఏ అంశాన్ని మరోసారి కోర్టు ముందు ప్రస్తావించారు. రెండు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం లంచ్ బ్రేక్ కోసం మధ్నాహ్నానికి విచారణ వాయిదా వేసింది.
చంద్రబాబు క్వాష్ పిటీషన్ పైన ఈ రోజు సుప్రీంలో విచారణ జరిగింది. బెంచ్ జస్టిస్ త్రివేదీ, జస్టిస్ బోస్ బెంచ్ ముందు సీఐడీ తరపున రోహత్గీ, చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, మనుషేక్ సింగ్ సింఘ్వీ వాదనలు వినిపించారు. 2018లో నేరం జరిగిందన్న వివరాలు రిమాండ్ రిపోర్టులో పెట్టలేదని చంద్రబాబు తరపు న్యాయవాది సాల్వే అభ్యంతరం వ్యక్తం చేసారు.

17 ఏ ప్రకారం అరెస్ట్ కు ఖచ్చితంగా గవర్నర్ అనుమతి కావాలని వాదనలు వినిపించారు. ఈ కేసులో సెక్షన్ 17a సవరణ వర్తిస్తుందని చెప్పాం, 1959 SCR 191 ప్రకారం ఈ కేసుకు ఇది వర్తిస్తుందని వాదించారు. జోక్యం చేసుకున్న న్యాయమూర్తి ఈ కేసు దర్యాప్తు 2018కి ముందే (అంటే 17A సవరణకు ముందే) మొదలయిందని రోహత్గీ చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు. విచారణ కొనసాగింపు కోసం మధ్నాహ్నానికి న్యాయమూర్తి వాయిదా వేసారు.
ఇప్పటికే సుప్రీంకోర్టు క్వాష్ పిటీషన్ పైన గత వారం విచారణ జరిగింది. ఆ సమయంలో సుదీర్గంగా జరిగిన వాదనల తరువాత హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ ఆలోపు సుప్రీంకోర్టుకు అందజేయాలని సీఐడీ తరఫు న్యాయవాదికి ధర్మాసనం ఆదేశించింది. ఈ రోజున పిటిషన్పై విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున సీనియర్ అడ్వొకేట్లు హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.
ఈ రోజు సైతం సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు కొనసాగించారు. చంద్రబాబు అరెస్టైన 3 రోజుల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారని, ఏకంగా 2వేల పేజీల పిటిషన్ ను న్యాయస్థానం ముందు ఉంచారని సుప్రీం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. జీఎస్టీ డీజీ విచారణ కాపీ గురించి నేటి విచారణలో సాల్వే ప్రశ్నించారు.
రాజకీయ ప్రతికారం కోసమే సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని, చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా నిబంధనలు పాటించలేదని హరీష్ సాల్వే ధర్మాసనానికి విన్నవించారు. గవర్నర్ అనుమతి తీసుకోనందున చంద్రబాబుకు అరెస్ట్ వర్తించదని సాల్వే ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
అవినీతి నిరోధక చట్ట సవరణలో ప్రతి పదం సునిశితంగా పరిశీలించి నిర్ధారించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆరోపణలు ఎప్పటివనేది కాదని.. కేసు నమోదు, విచారణ ఎప్పుడన్నదే చర్చించాల్సిన అంశంమని చెప్పారు. ఈ వాదనల నడుమ మధ్నాహ్నం తరువాత వాదనలు కొనసాగించేలా నిర్ణయిస్తూ వాయిదా వేసారు. ప్రధానంగా 17ఏ ఆధారంగానే వాదనలు కొనసాగుతున్నాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications